‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా “ఏ మాస్టర్ పీస్”. మనీష్ గిలాడ, అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్ తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ “ఏ మాస్టర్ పీస్” సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో “ఏ మాస్టర్ పీస్” సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ – “ఏ మాస్టర్ పీస్” సినిమా ఆఫర్ నాకు సుకు ఇచ్చే ముందే నాకు కొడుకు పుట్టాడు. నా కొడుకుకు నేను సూపర్ హీరోలా ఉండాలని అనుకున్నా. అదే టైమ్ లో సుకు ఈ మూవీ ఆఫర్ అందించాడు. మనీష్ నేను కాలేజ్ ఫ్రెండ్స్. మమ్మల్ని ప్రిన్సిపాల్ రూమ్ లో చూసిన తర్వాత ఇదే వేదిక మీద మా పేరెంట్స్ మమ్మల్ని చూడటం. మేము ప్రయోజకులం అయ్యామని చెప్పేందుకే మా పేరెంట్స్ ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేశాం.
మనీష్ గురించి మాట్లాడితే నేను ఎమోషనల్ అవుతాను. నాకు జీవితంలో ప్రతిసారీ వాడే ఇస్తున్నాడు వాడే సపోర్ట్ చేస్తున్నాడు. నేను వాడికి చేసిందేం లేదు. ఇప్పుడు కూడా నాకోసమే ఈ మూవీ ప్రొడ్యూస్ చేశాడు. మనీష్ నీకోసం ఏదైనా మంచి పని చేయాలని, నువ్వు గర్వపడేలా నేను ఉండాలని అనుకుంటున్నా. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. సుకు పూర్వజ్ నాకు గురూజీ లాంటి వాడు. నేను సినిమాలు వదిలేసిన టైమ్ లో నీలాంటి హీరో ఇండస్ట్రీలో ఉండాలి, సినిమాలు చేయాలని చెప్పి ఎంకరేజ్ చేశాడు. ఆయన డైరెక్షన్ లో శుక్ర మూవీ చేశాను. సుకుకు రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది. అయితే ఆయన నాతో మూవీ డిస్కషన్స్ లో ఉన్న టైమే ఎక్కువ. జ్యోతికి ఇది కోపం వచ్చే విషయమే. కొద్ది రోజులు అయితే మీ ఆయనను మీకు ఇచ్చేస్తాం. ఆత్మవిశ్వాసంతో మూవీ ఔట్ పుట్ చూసి చెబుతున్నాను. “ఏ మాస్టర్ పీస్” సినిమా మనం గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో మూవీ అవుతుంది. అన్నారు.