Crime ఈ కాలంలో యువత రోజుకి పక్కదారి పట్టిపోతున్నారు నిజమైన జీవితం విలువ తెలుసుకొని స్థాయి దాటిపోయారు అలాగే చిన్న చిన్న ఆనందాల కోసం ఎంతటి నీచ స్థాయికినా దిగజారుతున్నారు తాజాగా ఒక వ్యక్తి తన ప్రియురాలని విహారయాత్రకు తీసుకెళ్లడానికి తన ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు.. బీరువాలో ఉన్న 103 గ్రాముల బంగారు నగలు తీసుకుని ఉడాయించాడు.
ఓ వ్యక్తి తన ప్రియురాలని గోవా విహారయాత్రకు తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు దాంతో తన ఇంట్లోనే చోరీకి పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు వివరాల్లోకి వెళితే ఆడుగోడి మహాలింగేశ్వరబండె ఏరియాలో సోదరుడు సల్మాన్‌తో కలిసి నిందితుడు మహమ్మద్ ఇర్ఫాన్ ఉంటున్నాడు. సల్మాన్ సేల్స్ మాన్ గా పని చేస్తున్నాడు ఇర్ఫాన్ మాత్రం ఏ పని లేకుండా దుబారాగా తిరుగుతూ ఉండేవాడు అయితే ఇటీవల యువతని ప్రేమించాడు.. దీంతో వీరిద్దరూ కలిసి గోవా టూర్కు వెళ్లాలని అనుకున్నారు అయితే అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలని ఆలోచిస్తుండగా ఇంట్లో ఉన్న బంగారం గుర్తుకు వచ్చింది.. వెంటనే నా బంగారాన్ని చోరీ చేసి టూర్ కి వెళ్లాలని ప్లాన్ చేశాడు..
దీంతో బీరువాలో ఉన్న 103 గ్రాముల బంగారు నగలు తీసుకుని ఉడాయించాడు. విషయం తెలిసిన సోదరుడు సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు గోవాకు వెళ్లి షికారు చేస్తున్న ఇర్ఫాన్ ను పట్టుకొని అరెస్టు చేశారు అంతేకాకుండా అతని వద్ద ఉన్న బంగారాన్ని డబ్బును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..