Crime ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి ప్రతిరోజు వీటిపై ఎంత అవగాహన కల్పించిన ఏదో ఒకటి ఎక్కడో ఒకరు మోసపోతూనే ఉంటున్నారు ఈ విషయాలతో జాగ్రత్తగా ఉండకపోతే పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్న కొందరు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు తాజాగా ఒక అమ్మాయి ఈ విధంగానే మోసపోయి పోలీసులు ఆశ్రయించింది..
ఆన్లైన్ ఎక్కువగా అందుబాటులోకి వచ్చాక ఈ మోసాలు బాగా పెరిగిపోయాయి ఎప్పుడు మోసం చేద్దామని కాచుకుచుంటున్నారు సైబర్ నేరగాళ్లు.. తనకు అప్పులు ఎక్కువయ్యాయని వాటి నుంచి బయట పడాలని చూసే ప్రయత్నంలో మరో పెద్ద సమస్యలు ఇరుక్కుపోయింది ఓ అమ్మాయి గుంటూరు జిల్లాకు చెందిన ఓ అమ్మాయి తనకు అప్పలెక్కువయ్యాయని ఇంట్లో చెప్పాలంటే భయమేసి.. ఏం చేయాలా అని ఆలోచించింది ఈ నేపథ్యంలోనే తనకు యూట్యూబ్లో కిడ్నీ డొనేషన్ అనే యాప్ కనిపించడంతో దాని గురించి తెలుసుకోవాలనుకుంది వెంటనే ఆ నెంబర్కు మెసేజ్ చేసి దాన్ని కిడ్నీ అమ్ముతానని.. చెప్పగా అవతలి వాళ్ళు ఆరు కోట్లు ఇస్తామని అన్నారు.. అలాగే మొత్తం ఒకేసారి ఇవ్వకుండా ముందు మూడు కోట్లు ఇచ్చే తర్వాత మిగిలినవి డబ్బులు ఇస్తామని చెప్పారు..
ఇకనుంచి ఒక ఫేక్ ఆన్లైన్ ఎకౌంట్ క్రియేట్ చేసి అందులో మూడు కోట్లు ఆమె పేరు మీద పడినట్టు చూపించడంతో ఆమె నిజమని నమ్మేసింది ఈ డబ్బులు అన్ని ఆమె అకౌంట్లోకి రావాలి అంటే 16 లక్షల కట్టాలంటూ నమ్మించి మళ్లీ లక్ష 15000 కావాలని అడిగారు దీంతో ఆమెకు విసుగు వచ్చి నేను నా కిడ్నీ మీరు డబ్బులు రిటన్ ఇవ్వండి అని అడగ్గా.. ఢిల్లీ వస్తే ఇస్తామని ఆమెకు చెప్పారు దీంతో ఆమె నమ్మి అక్కడికి వెళ్ళగా అలాంటి హాస్పిటల్ లేదు.. దీంతో మోసపోయానని గ్రహించి.. ఇంట్లో వాళ్లకు విషయం చెప్పింది. తాజాగా తండ్రితో కలిసి వచ్చి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంతో సైబర్ క్రైమ్ పోలీసులు మరొకసారి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు..