Crime పోలీస్ కావాలనే ఆమె తన కలను ఎలాగైనా తీర్చుకోవాలని పట్టుదలతో ఉన్న ఒక అమ్మాయి చివరికి చేసిన తప్పిదంతో ఏకంగా అర్హత జీవితాంతం లేకుండా చేసుకుంది తాజాగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ లో జరిగిన ఈ సంఘటన వైరల్ గా మారింది..
ఎలాగైనా పోలీస్ కావాలనే ఒక అమ్మాయి పట్టుదలతో ముందుకు వెళ్ళింది అలాగే నేపథ్యంలో మొదటి పరీక్ష పాస్ అయ్యి రన్నింగ్ లాంగ్ జంప్ కూడా పూర్తి చేసింది అయితే తన ఎత్తు కారణంగా సెలెక్ట్ అవుతానో లేదో అని భయంతో ఒక చిన్న తప్పు చేసింది.. తన జుట్టులో ఎంసీలు మైనపు మొక్కను అతికించుకొని ఎవరికి అనుమానం రాకుండా ఫిజికల్ టెస్ట్ లో పాల్గొంది… అభ్యర్థుల ఎత్తున కొలిచే సెన్సార్ పరికరం ఈ విషయాన్ని కనిపెట్టేసింది.. ఆ మహిళా అభ్యర్థి నిల్చొగానే.. ఎలక్ట్రానిక్ ఎత్తు కొలిచే పరికరం స్పందించలేదు. తొలుత డివైస్ లోపం ఏవైనా ఉందేమోనని పరిశీలించిన అధికారులు.. అలాంటి ఏదీ లేదని నిర్ధారించుకున్న తర్వాత మహిళా సిబ్బందితో ఆ అభ్యర్థిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. దీంతో మోసం బయటపడింది. ఎత్తు పెంచడానికి ఆమె తన వెంట్రుకల కింద M-సీల్ మైనాన్ని అతికించినట్లు గుర్తించారు.. దీంతో అధికారులు ఆమెపై అనర్హత వేటు వేసి, పంపించేశారు. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో భాగంగా మహబూబ్‌నగర్ పట్టణంలో కొనసాగుతున్న శారీరక దారుఢ్య పరీక్షల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎలా అయినా పోలీసు అయ్యి తన కలను నెరవేర్చుకోవాలని ప్రజలకు సేవ చేయాలని మంచి దృక్పథంతో ఉన్న అమ్మాయి చేసిన చిన్న పొరపాటు తనను జీవితాంతం ఆకలకు దూరం చేసింది పోలీసు అవ్వాలనుకునే అమ్మాయి తర్వాత కూడా ఎంతో నిజాయితీగా ఉండాలి అలాంటిది ముందునే ఇలాంటి మోసపూరిత పని చేయడం క్షమించవలసింది కాదుగా గుర్తించి అధికారులు ఆమెపై అనర్హత వేటును వేశారు..