గ్రీన్ఇండియా చాలెంజ్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో భాగంగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్ జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ‘థమన్’ మాట్లాడుతూ… ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో పాల్గొని మొక్కలు నాటడం ఎంతో ఆనందంగా ఉందని, ఒక ప్రాణం పోసినట్లుగా గొప్ప అనుభూతి కలిగిందన్నారు. ఇప్పటివరకు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ద్వారా 16 కోట్లకు పైగా మొక్కలు నాటడం చాలా గొప్ప విషయమని అన్నారు.
ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్ గా కనిపించే మన హైదరాబాద్ నగరంలో అభివృద్ధితోపాటు పచ్చదనం పెంచేలా గ్రీన్ ఇండియా చాలెంజ్ చేస్తున్న కార్యక్రమాల ద్వారా పచ్చదనం మరింత పెరిగిందన్నారు. ‘గ్రో గ్రీనరీ ఇండియా’కై గ్రీన్ ఇండియా చాలెంజ్ భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని థమన్ ఆకాంక్షించారు. ఇంత మంచి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం ముగ్గురు సంగీత దర్శకులు అనూప్, కళ్యాణ్ మాలిక్, మిక్కీ జే మేయర్ లకు థమన్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ను విసిరారు.