సామాజిక మార్పుకోసం గొప్ప స్పూర్తినిచ్చే బహుజన మహనీయుల ఐతిహాసిక ముంబై స్థావరాలకు విచ్చేసిన తెలుగు రాష్ట్రాల మేధావులకు స్థానిక కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవల తెలంగాణలో మహాద్భుతంగా నిర్మించిన ‘బుద్ధవనం ప్రాజెక్ట్ & Quot కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఉన్న కె. సుధాన్ రెడ్డి సుప్రసిద్ధ ఆర్కాలజిస్ట్ బుద్ధిస్ట్ కన్సల్టెంట్ బుద్ధవనం ప్రాజెక్టు వందకుపైగా పుస్తకాలు రాసిన రచయిత డాక్టర్ ఈమని శివనాగి రెడ్డి ముంబైని పర్యటించారు. వీరిద్దకి ఆదివారం నగరంలో బాబాసాహెబ్ గారి చారిత్రాత్మక గ్రంథాల నివాసమైన ‘రాజగృహ’ ఆయన సమాధి & Quot, చైత్యభూమి & Quot వద్ద పూలగుచ్ఛం ఇచ్చి శాల్వ కప్పి తెలుగు అంబేడ్కరైట్లు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శివనాగి రెడ్డి చైత్యభూమి సాక్షిగా మాట్లాడుతూ… కేవలం డాక్టర్ అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగం వల్లనే తెలంగాణ స్వరాష్ట్రాన్ని తాము సాధించామని అయన సమాధిని సందర్శించడం వల్ల చాలా స్ఫూర్తిని పొందామని పేర్కొన్నారు.
మరో అతిథి కె. సుధాన్ రెడ్డి మాట్లాడుతూ… ముంబై వలస జీవులు తమ బుద్దవనం ప్రోజెక్టును చూడానికి తెలంగాణ గడ్డకు రావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. చివరిలో ఆనాడు అంబేడ్కర్ నిత్యం చాయ్ (టీ) త్రాగే ఇతిహాసిక హోటల్ కు వెళ్లి ఇరువురు స్వయంగా టీ త్రాగి ఆ మహానుభావున్ని నెమరు వేసుకున్నారు.
ఇట్టి ఉద్యమ యాత్రలో ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం ప్రతినిధులైన వడ్డి సూర్యనారాయణ, సంటి శంకర్ మహారాజ్ శివరాజ్, బొల్లే సుక్క నర్సింహా, కున్బి నారాయణ, రమేష్ చౌవల్, వడాల నుంచి పేట శివప్ప రాందాస్ గాయత్రి బాబు మాత్రే గోరేగావ్ నుంచి జి.శేషగిరిరావు బొంతు శ్రీనివాసరావు అంధేరి నుంచి ఎన్. శరత్ పి. సిల్వెస్టర్ బి.రాంప్రసాద్ ముదిరాజ్ కె. చంద్రన్న బెస్త భీంరత్న మాలజీ మూల్ నివాసి మాలజీ పాల్గొన్నారు.