సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లో పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం, మూడు యూనిట్లుగా పోలీసు సహకారసంఘం విభజన. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లో ఈరోజు i.e. 08.06.2022 పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం సైబరాబాద్ పోలీసు కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, IPS, గారి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ గారు మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడే పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ శుభాకాంక్షలు తెలియజేశారు. కో-ఆపరేటివ్ నిపుణుల అభిప్రాయం ప్రకారంగా పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీని విభజించడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. తద్వారా కొత్తగా ఏర్పడే సొసైటీలు పోలీసు సిబ్బందికి ఎక్కువ మెరుగైన సేవలను విస్తరించేలా మరియు అనేక మందికి సహాయం చేసేలా రూపుదిద్దుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. కో-ఆపరేటివ్ సొసైటీలో సాంకేతిక నిపుణులతో ఆడిటింగ్ నిర్వహిస్తూ సిబ్బంది యొక్క ప్రతి పైసాకు జవాబుదారీతనం గా ఉండేలా చూడాలన్నారు.
పోలీసు సహకర సంఘం 1951 లో పోలీసు కానిస్టేబుల్ నుండి సబ్ ఇన్స్పెక్టర్, Ministerial Staff సంక్షేమము కొరకు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం లో హైదరాబాద్ రూరల్ జిల్లా గా ఉన్నప్పుడు తేదీ 31-8-1951 న పోలీసు సభ్యుల సంక్షేమము కొరకు అప్పటి చట్టాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ నెంబర్ 20479/1951 నమోదు చేయించపడి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, దిగ్విజయంగా 72 వసంతాలు పూర్తి చేసుకుంది. కాలానుగుణంగా పోలీసు సంస్థను పరిపాలన సౌలభ్యము కోసం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్, రంగారెడ్డి జిల్లా గా విభజించడం జరిగింది సైబరాబాద్ కమీషనరేట్ ను సైబరాబాద్ , రాచకొండ, వికారాబాద్ కమిషనరేటులుగా విభజించడం జరిగింది . పోలీసు సంస్థను పరిపాలన సౌలభ్యము కొరకు మూడు భాగాలుగా విభజన జరిగినప్పటికి సిబ్బందిని విభజించకుండ ఒకే Seniority కింద ఉంచినందున ఈ సొసైటి ని విభజించడానికి వీలు కానందున యాధావిదంగా సంఘ కార్యక్రమాలు కొనసాగించడం జరిగింది . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో ప్రకారం కొత్త జోనల్ వ్యవస్థను అమలులోనికి తెచ్చిన్నందున పాత రంగారెడ్డి జిల్లా సిబ్బందిని శాశ్వతంగా విభజించడం జరిగింది . దీనికి అనుగుణంగా కో – ఆపరేటివ్ సంఘం చట్ట బద్దమైన సంస్థ అయినందున TELANGANA STATE CO – OPERATIVE SOCIETIES ACT 1964 , SECTION 12-4 ప్రకారం విభజన చేయాలని సంఘం అధ్యక్షులు, మూడు యూనిట్ల నుండి సభ్యులు మరియు అధికారులతో సమావేశము నిర్వహించి విభజన కొరకు తీర్మానించారు. దాని ప్రకారంగా Auditors , కో-ఆపరేటివ్ నిపుణులను సంప్రదించి దీనికి ఒక ప్రణాళిక తయారు చేసి, దానికి అనుగుణంగా కొన్ని చట్ట బద్ధమైన తీర్మానాలు చేసి ఆడిటర్ నివేదిక ప్రకారం , కో-ఆపరేటివ్ నిపుణుల అభిప్రాయం ప్రకారంగా విభజన నిర్ణయం తీసుకున్నారు.
అనంతరం రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు ఐపీఎస్., గారు మాట్లాడుతూ.. కో-ఆపరేటివ్ సొసైటీని వల్ల అనేకమంది ప్రయోజనాలు కలుగుతాయని, చిన్న మొత్తలను చేసి చిన్న రిటర్న్స్ పొందేకన్న పెద్ద మొత్తలతో పెద్ద రిటర్న్స్ పొందడం ఉత్తమం అని, కో – ఆపరేటివ్ సొసైటీలో ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ ఉండాలన్నారు.
వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి, ఐపీఎస్., గారు మాట్లాడుతూ.. 72 సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి ఈ ఒక్క పోలీస్ కోపరేటివ్ సొసైటీ ఇప్పుడు విడిపోవడం బాధగా అనిపించినప్పటికీ మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీస్., గారు మాట్లాడుతూ.. పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీలో కొత్త పాలసీలను ప్రవేశపెట్టి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఈ సమావేశంలో సీపీ గారి తో పాటు జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు ఐపీఎస్., వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఐపీఎస్., సైబరాబాద్ అడ్మిన్ డీసీపీ అనసూయ ఐపీఎస్., రాచకొండ అడ్మిన్ ఏడీసీపీ శ్రీనివాసులు, రాచకొండ ఎస్బీ ఏసీపీ జావేద్, సైబరాబాద్ ఎస్బీ ఏసీపీ సురేందర్, మరియు మూడు యూనిట్ల కో-ఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.