మాజీ మంత్రి, నరసాపురం సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిని వైసీపీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు, క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం జగన్ ఆదేశాల మేరకు వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.