1. దేశ చరిత్రలోనే తొలిసారిగా టీడీపీ, చంద్రబాబు నాయుడు ఓడిపోతే సంబరాలు చేసుకుంటున్నారు. 13,000 పైచిలుకు సర్పంచ్ స్థానాలకు నాలుగు విడతలుగా ఎన్నికలు జరిగాయి. 10,500 స్థానాలకు పైగా వైయస్‌ఆర్‌సీపీ (81%) మద్దతుదారులు గెలుచుకొన్నారు. కేవలం 16% స్థానాలను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. దీన్నో పెద్ద విజయంగా టీడీపీ చెప్పుకోవటం దిగజారుడుతనమే. ఆ 16% కూడా వస్తాయని టీడీపీ ఊహించుకున్నారో, లేదో. ప్రతిదశ ఎన్నికల్లో అంచెలు అంచెలుగా టీడీపీ పుంజుకుందని, వైయస్‌ఆర్‌సీపీ పతనం మొదలైందని మీడియా సమావేశంలో చంద్రబాబు అనటంపై మంత్రి అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్లో 81% వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులను ప్రజలు గెలిపించారు. దీనికి సీఎం శ్రీ జగన్ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలే కారణం. టీడీపీకి ఆ 16% కూడా రావటానికి వైయస్‌ఆర్‌సీపీ రెబల్స్ పోటీ చేయటమే కారణం. పైగా 41% పంచాయితీ స్థానాలను కైవసం చేసుకున్నామని చంద్రబాబు చెప్పటానికి సిగ్గుండాలి. ఎల్లో మీడియాలో నాలుగు ఛానల్స్ ద్వారా ఇష్టానుసారంగా బాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా అభూత కల్పన. చంద్రబాబుకు దమ్ము, ధైర్యమే ఉంటే ఆయన లెక్క ప్రకారం నాలుగో విడతలో 1200-1300 స్థానాలు వచ్చి ఉండాలి. దమ్ముంటే వారికి వచ్చిన సర్పంచ్ అభ్యర్థులను కండువా వేసి నిలబెట్టే దమ్ముందా? నిజంగా 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు పనిచేస్తే.. ఏ జిల్లాలో అయినా ఈ 1300 మంది మా మద్దతుదారులు గెలిచారని చెప్పే దమ్ముందా? ఏదో అబద్ధం చెప్పేసి పండుగ చేసుకొని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు గెలిచి పార్టీ కండువాలతో పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు.
3. చంద్రబాబు పుట్టిన ప్రాంతం చంద్రగిరిలో 107 పంచాయితీలు ఉంటే 104 చోట్ల ఓడిపోయి.. 3 పంచాయితీలు మాత్రమే గెలిచారు. అలా గెలిచిన చోట్ల ఆయన పుట్టిన ఊరు ఉంది. అందులో 8 వార్డులు గెలుచుకున్నారని సంబరాలు చేసుకుంటున్నారు. అలా వార్డులు గెలిచినందుకు సంబరాలు చేసుకోవటంపై సిగ్గు ఉండాలి. ఓవైపు చంద్రబాబు పుట్టిన చంద్రగిరిలో డిపాజిట్లు కోల్పోయారు. బాబు వలసపోయిన కుప్పంలో 89 పంచాయితీల్లో 74 వైయస్ఆర్సీపీ మద్దతుదారులు గెలిచారు. చంద్రబాబు ఇలాకాలోనే 20% సీట్లు సాధించలేని టీడీపీ 41% సీట్లు సాధించామని చెప్పుకోవటం ఏంటి? ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి ఉందా?
4. పదేళ్ల పాటు ప్రజల్లో ఉండి వారితో మమేకమై తనపని తాను చేసుకుంటూ సీఎం శ్రీ జగన్ ముందుకు వెళ్తున్నారు. కానీ సర్పంచ్ ఎన్నికల్లో 25 మీడియా సమావేశాలు పెట్టిన మహా ఘనుడు ప్రతిపక్షనాయకుడు చంద్రబాబే. ఇలా సర్పంచ్ ఎన్నికల్లో ఇన్ని మీడియా సమావేశాలు పెట్టిన ఘనుడు దేశంలో మరొకరు ఉండరు. పోలీసులు దౌర్జన్యాలు చేస్తున్నారని చంద్రబాబు అంటారు. ఓవైపు దత్తపుత్రుడు అనొచ్చో, ఇంకొకటి అనొచ్చే తెలీదు కానీ నిమ్మగడ్డ రమేశ్ కుమారే పోలీసు యంత్రాంగం బాగా చేసిందని.. అధికారులు బాగా పనిచేశారని పొగుడుతున్నారు. కానీ చంద్రబాబు ఏమో పోలీసులు రావణకాష్ఠం చేశారంటారు. అదే నేను చేసుంటే అని చంద్రబాబు అంటున్నారు. ఒక్కసారి చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకోవాలి. గతంలో ఎంపీటీసీ, జెడ్ పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా టీడీపీ వాళ్ళు రాద్ధాంతం చేశారు. అదీ రావణకాష్ఠం అంటే. రౌడీ రాజ్యం అది. అక్కడ నుంచి ఈరోజు రామరాజ్యం శ్రీ జగన్ మోహన్ రెడ్డి రాజ్యంలో సుభిక్షంగా ప్రశాంతమైన వాతావరణంలో 10,500కు పైగా సర్పంచ్ స్థానాలు వైయస్ఆర్సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.
5. చంద్రబాబు ఆ నాలుగు ఛానల్స్ మీద ఆధారపడ్డారు. ఆ ఛానల్స్‌లోనే టీడీపీ పుంజుకుందంటారు. ఎక్కడ పుంజుకుంది టీడీపీ. పతనమైంది వైయస్‌ఆర్‌సీపీ కాదు. ఎవరు పతనం అయ్యారో .. అందరికీ తెలుసు. కనీసం ఒక్క నియోజకవర్గంలో 40% సీట్లు సాధించామని చెప్పటానికి ఒక్కచోటైనా ఉందా? కంచుకోట అనేది ఎక్కడైనా ఉందా? కుప్పంలోనే చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టారు. సిగ్గులేకుండా ఇవాళ మీడియా సమావేశం పెట్టి 8 వార్డులు గెలుచుకున్నారట. దానికి సంబరాలంట. లేకపోతే 10% అదనంగా వచ్చేవని చంద్రబాబు అంటారు. మా రెబల్స్ లేకపోతే సింగిల్ డిజిట్ వచ్చి ఉండేవి. ఈరోజు వైయస్ఆర్‌సీపీ మద్దతుదారులకు వచ్చిన ఫలితాలే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో తిరిగి పునరావృతం అవుతాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.
6. చివరకు చంద్రబాబు మతిస్థిమితం కోల్పోతున్నారు. 2024 నాటికి బూత్‌లలో మెజార్టీ వచ్చినా సంబరాలు చేసుకునే రోజు టీడీపీకి వస్తుంది. చివరకు అంపశయ్య నుంచి చితిలో పడిపోయే పరిస్థితికి టీడీపీ వచ్చింది. ఆల్మోస్ట్ టీడీపీ క్లోజ్. వైయస్ఆర్సీపీ 80 శాతం పైగా మద్దతుతో ఎక్కడో పైన ఉంటే.. కింద ఉన్న ప్రతిపక్ష పార్టీలు మేమే శ్రీ జగన్ గారికి ప్రతిపక్షం అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. రెండోస్థానం కోసం ప్రతిపక్షాలు కొట్లాడుకుంటున్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీలు ఎక్కడున్నాయి.