మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర`. కీలకమైన భారీ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రవితేజతో పాటు కీలక పాత్రలో నటిస్తున్న సుశాంత్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు.
ఈరోజు సుశాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ టీమ్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. సుశాంత్ నీలి రంగు కళ్ళతో, పొడవాటి జుట్టు, గడ్డంతో తీక్షణంగా చూస్తున్నట్లు కనిపిస్తున్నాడు. దీనిని బట్టి ఆయన పాత్ర వైవిధ్యంగా వుంటుందని అర్థమవుతోంది.
తారాగణం : రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది : దర్శకుడు: సుధీర్ వర్మ, నిర్మాత: అభిషేక్ నామా,బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్, కథ, స్క్రీన్‌ప్లే & సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్, DOP: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్: శ్రీకాంత్, ప్రొడక్షన్ డిజైనర్: DRK కిరణ్, సీఈఓ: పోతిని వాసు, మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు, PRO: వంశీ-శేఖర్.