హీరోకు ఫ్యాన్స్ ఉంటారు.. హీరోయిన్స్‌కి ఫ్యాన్స్ ఉంటారు.. రాజకీయ నాయకులకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ దర్శకునికి ఒక హీరో అభిమాని అయితే. . దాని ఫలితం ఎలా ఉంటుంది? ఆయన మీద ఉన్న అభిమానం వ్యక్తీకరిస్తే ఏ రేంజ్‌లో ఉంటుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వివరాల్లోకి వెళితే, సువీక్షిత్ బొజ్జా అనే నవ హీరో ఎన్నో ఏళ్లుగా దర్శకుడు సుకుమార్‌కి వీరాభిమాని. పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’తో భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా నిలిచిన సుకుమార్ పై ఉన్న ప్రేమతో, అభిమానంతో.. ఇప్పటి వరకు ఏ అభిమాని కూడా చేయని ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. దానిని విజయవంతంగా పూర్తి చేశాడు.
‘దూరదర్శిని’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సువీక్షిత్.. తన సొంత గ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని బోరెడ్డిగారి పల్లి గ్రామంలో.. ఆయన సొంత వ్యవసాయం భూమిలో రెండున్నర ఎకరాల భూమిలో దర్శకుడు సుకుమార్ రూపాన్ని వచ్చేటట్లు వరి పంటతో సాగు చేశారు. దాదాపు 50 రోజుల వ్యయప్రయాసలతో.. ఆ పంటను సుకుమార్ రూపానికి తీసుకువచ్చాడు. ఇలా అభిమానాన్ని చాటుకున్న సువీక్షిత్ అందరి దృష్టిని ఆకర్షించి హాట్ టాపిక్‌గా మారాడు. ఈ సాగుచేసిన పంట భూమిని ఆ రూపానికి తీసుకువచ్చిన తర్వాత.. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడంతో పాటు.. సుకుమార్ పేరు మీద ఓ ప్రత్యేక పాటను రెడీ చేశాడు. సుకుమార్ రూపంతో పాటు.. ‘పుష్ప 2’ అని కూడా వరిసాగు చేయడం.. అల్లు అర్జున్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సాంగ్‌ను, వీడియోను చూసిన సుకుమార్ ‘‘నా నోట మాట రావడం లేదు.. నా కళ్లు చెమర్చాయి. ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా?..’’ అంటూ అందరి సమక్షంలో సువీక్షిత్‌ని అభినందించారు.Creative genius Sukumar’s Ekalavya sishya, DOORADARSHINI Hero #Suvixith has farmed paddy in his farmland in Kadapa in the shape of his favorite director @aryasukku He shared a pic shot with a drone. Suvixith has also expressed his love for Pushpa franchise, impressing @AlluArjun’s fans too.
https://youtu.be/uwPQ-w_hND0