ద్వాదశ రాశులు వారికి గోచార రీత్యా ఫిబ్రవరి 21 – 27th వరకు వారఫలాలు.
మేష రాశి:
ఆరోగ్య పరమ గా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా గడుపతారు.ఆదాయపరం గా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. సంతాన పరం గా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురు అవుతాయి.విద్యార్థుల కి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి . వృత్తిరీత్యా ప్రయాణాలు వుండే అవకాశం ఉంది . వ్యాపార పరంగా స్వల్ప ఆదాయం అందుకుంటారు.వివాహజీవితం లో స్వల్ప ఇబ్బందులు ఎదురుకుంటారు.రైతులకి ఆశా జనకమైన ఫలితాలు కలుగుతాయి.ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు కలగటం కోసం లక్షినరసింహ స్వామి నీ ఆరాధించటం ఉత్తమం.
వృషభ రాశి:
ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్త పాటించాలి.ఆదాయ పరంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి లో మార్పు వుండే అవకాశం ఉంది. వ్యాపారస్థులకి స్వల్ప ఆదాయం ఉంటుంది.మంత్రఉపదేశం పొందాలనుఅనుకునేవారికి అనుకూలం.ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు పొందటం కోసం వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల ను సమర్పించటం శ్రేయస్కరం .
మిథున రాశి:
ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం బాగుంటుంది. విద్యార్థులు అధిక శ్రమ చెయ్యాల్సి ఉంటుంది. వృత్తి జీవితం లో పని అధికంగా ఉంటుంది.వ్యాపారస్తులకు స్వల ఆదాయం సూచిస్తోంది.ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం చంద్రశేఖర అష్టకం చదవటం శ్రేయస్కరం
కర్కాటక రాశి:
వీరికి ఆరోగ్యపరంగా సానుకూల ఫలితాలు కలుగుతాయి.స్వల్ప ఆదాయం ఉంటుంది.ఆర్థిక పరమ మైన విషయంలో ఎవరిని నమ్మకపోవటం మంచిది.వీరి యొక్క సంతానానికి వృత్తి లో ఇబ్బందులు ఎదురు అయ్యే అవకాశం ఉంది. వ్యాపార రీత్యా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి.కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.వృత్తిజీవితం లో సానుకూల ఫలితాలు కలుగుతాయి.వీరు ఉత్తమ ఫలతాలు పొందటం కొరకు శివాలయం సందర్శించడం మంచిది.
సింహ రాశి:
వీరికి ఆరోగ్యపరంగా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.వ్యాపారపరంగా కలసి వస్తుంది.వృత్తి జీవితం లో మంచి గుర్తింపు లభిస్తుంది.విద్యార్థుల కి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వీరికి ఉత్తమ ఫలితాలు కలగటం కోసం శ్రీ రామ రక్షా స్తోత్రము పఠనం చెయ్యటం ఉత్తమం.
కన్యారాశి:
ఈ రాశి వారుఆనార్యోగ సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది.ఆర్థికపరంగా మంచి ఆదాయం లభిస్తుంది.విద్యార్థులకు ఉన్నత విద్య కి సంబందించిన పరీక్షలలో విజయం సాధిస్తారు. వీరి యొక్క సంతానం మంచి అభివృద్ధిని సాధిస్తారు.నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కొరకు హనుమాన్ ను పూజించటం శ్రేయస్కరం.
తుల రాశి:
ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత జాగ్రర్త వహించాలి.ఆర్థికపరమైన విషయాల్లో తక్కువ అభివృద్ధి కలుగుతుంది.వీరి తోబుట్టువులకి గృహ లాభం కనిపిస్తోంది.విద్యార్థులు లకి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వ్యా పారం లో సానుకూల ఫలితాలు కలుగుతాయి.ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు కలగటం కోసం,విష్ణు సహస్ర నామాల చదవటం శ్రేయస్కరం.
వృశ్చిక రాశి:
ఆరోగ్య పరంగా సానుకూల ఫలితాలు కలుగుతాయి.ఆదాయం పెరుగుతుంది.నూతన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత సానుకూల ఫలితాలు కలుగుతాయి.ఉద్యోగరీత్యా ప్రయాణాలు సుచించపడుతున్నాయి.
వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం సుబ్రమణ్య స్వామి ని ఆరాధించటం ఉత్తమం.
ధనస్సురాశి:
ఆర్థిక వృద్ధి.కుటుంబ సభ్యుల తో శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు.సంతానం కోసం ఎదురుచూస్తున్నా వారికి శుభవార్తలు అందుతాయి.ఉద్యోగులకు ఆర్థిక లాభం. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం సూర్య అష్టకం చదవటం శ్రేయస్కరం.
మకర రాశి:
వ్యాపారం లో రాణిస్తారు.వివాహప్రయత్నలు ఫలిస్తాయి.గృహ/వాహన లాభం.విద్యార్థులకు ఉన్నత విద్య ప్రాప్తి.ఉద్యోగంలో ఆర్థిక వృద్ధి.ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం కనకధారా స్తోత్రం చదవటం శ్రేయస్కరం.
కుంభ రాశి:
దూరప్రయాణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారం లో ఉన్నతి. అధిక వ్యయం సూ చించ పడుతోంది.వృత్తి రీత్యా గుర్తింపు లభిస్తుంది. వీరు ఉత్తమ ఫలితాలు కలగటం కోసం వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చెయ్యటం ఉత్తమం.
మీన రాశి:
వీరికి వృత్తి,వ్యాపార పరంగా బాగుంటుంది.విద్యార్థుల కి ఉత్తమ ఫలితాలు అందుతాయి.వీరి జ్యేష్ఠ సోదరలకు అభివృద్ధి కనిపిస్తోంది.ఆర్థిక పరమైన నిర్ణయాలను తీసుకొనే విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాలి.వీరికి ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ దత్తాత్రేస్వామిని స్మరించుట ఉత్తమం.