సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో SLV సినిమాస్ LLP మరియు RT టీమ్‌వర్క్స్‌పై నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించిన మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` నిర్మాణ ప్రక్రియ చివరి దశలో ఉంది.
మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. రవితేజ సిన్సియర్ డ్యూటీ మైండెడ్ డిప్యూటీ కలెక్టర్‌గా చురుకైన పాత్రలో కన్పించారు, మాస్‌ని ఆకట్టుకునేలా, టీజర్‌లో పుష్కలంగా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. నిజానికి టీజర్‌లో కొన్ని పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ప్రత్యేకించి, రవితేజ చెప్పిన “నేరస్థులకు తప్పకుండా శిక్ష పడుతుంది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా సరే” అని రవితేజలోని నిష్పాక్షికమైన కేరెక్టర్‌ను సూచిస్తుంది.
నటీనటులు : రవితేజ, దివ్యాంశా కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
సాంకేతిక సిబ్బంది : కథ, స్క్రీన్‌ప్లే, మాటలు & దర్శకత్వం: శరత్ మండవ,నిర్మాత: సుధాకర్ చెరుకూరి, బ్యానర్: SLV సినిమాస్ LLP, RT టీమ్‌వర్క్స్, సంగీత దర్శకుడు: సామ్ సిఎస్, DOP: సత్యన్ సూర్యన్ ISC, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్ ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, PRO: వంశీ-శేఖర్.