సుధీర్ బాబు నటుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ‘శివ మనసులో శృతి’, మేల్ లీడ్‌గా అతని మొదటి చిత్రం, 10 ఫిబ్రవరి 2012న విడుదలైంది. రేపటికి అంటే గురువారానికి ఆయన సినిమాలోకి వచ్చి పదేళ్ళు పూర్తవుతాయి. శ్రీదేవి సోడా సెంటర్, ‘సమ్మోహనం వంటివి మంచి పేరు తెచ్చి పెట్టాయి. అదే దర్శకుడితో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే రొమ్-కామ్‌లో చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాలో తన సినీ జర్నీని పంచుకున్నారు.
నేను చేసిన సినిమాల సంఖ్య, సంపాదించిన అభిమానుల సంఖ్య కంటే, నాకు నటుడిగా నేను సంపాదించిన గౌరవమే ముఖ్యం. వెనక్కి తిరిగి చూసుకుంటే, నటుడిగా వందశాతం కష్టపడ్డాను. ఆ సంతృప్తి నాకు వుంది. నా సినిమాలు కొన్ని వదిలేశాను. మరికొన్నింటికి పనిచేశాను. నా కెరీర్‌లో వైఫల్యాలు నాకు విలువైన పాఠాలు నేర్పాయి. స్క్రిప్ట్‌లను ఎలా ఎంచుకోవాలో నేర్చుకున్నాను. కథతో పాటు బడ్జెట్‌లు, టెక్నికల్ టీమ్‌ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని గ్రహించాను.నాకంటూ గుర్తింపు, గౌరవం వుండాలనే ఏకైక లక్ష్యంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. మా నాన్న బిజినెస్ చూసుకోమన్నారు. కొన్నాళ్ళ చేశాక. ఏదో సాధించాలని ఈ రంగంలోకి వచ్చాను. సినిమాల్లో ఎప్పుడూ ఖచ్చితమైన ప్రణాళిక లేదు. ఎప్పటికప్పుడు కథల ఎంపికలు చేసుకుంటూ ముందుకు సాగాను. బాక్సాఫీస్ విజయాన్ని మీరు పరిశ్రమలో అంచనా వేస్తారు.
నాకు యాక్షన్ చిత్రాలంటే ఇష్టం. నేను జాకీ చాన్‌కి పెద్ద అభిమానిని. బెంచ్ మార్క్ యాక్షన్ సినిమాలు చేయబోతున్నాను. నటుడు-రచయిత-దర్శకుడు హర్షవర్ధన్‌తో ఓ సినిమా చేస్తాను. ‘లూజర్ 2’ (వెబ్ సిరీస్) దర్శకుడు నాతో సినిమా చేయనున్నాడు.
కెరీర్ పరంగా, కృష్ణగారు, మహేష్ నుంచి చాలా నేర్చుకున్నా. షూటింగ్ వున్నా సాయంత్రానికి కుటుంబంతో గడిపేవారు. వారి నుంచి అవి నేర్చుకున్నా. నేను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పని నుండి ఎలా స్విచ్ ఆఫ్ చేయాలో నేను కృష్ణగారు నుండి నేర్చుకున్నాను. ‘ప్రేమ కథా చిత్రమ్’ విడుదలైనప్పుడు మహేష్ నన్ను మెచ్చు కున్నారు. సినిమాల్లోకి రాకముందు బ్యాడ్మింటన్ ఆడాను. పుల్లెల గోపీచంద్ బయోపిక్ తెరకెక్కుతోంది. పెద్ద సంస్థ ముందుకు వచ్చింది. త్వరలో సెట్ పైకి వెళ్ళబోతోంది.