కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మహారాజా రవితేజ సగర్వ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మను ఆనంద్ తో ఇంటర్వ్యూ విశేషాలు.
ఎఫ్.ఐ.ఆర్. ఏ తరహా సినిమా?: యాక్షన్ థ్రిల్లర్ మూవీ. యంగ్ ముస్లిం టెర్రరిజంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏమయింది అనేది కథ. మీకు మొదటి సినిమా విష్ణు విశాల్ ను ఎలా ఒప్పించగలిగారు? విష్ణు విశాల్ సినిమాలు నేను చూశాను. రాక్షసన్ సినిమాలో ఆయన నటన గమనించా. నా కథకు తగిన పాత్ర ఇతనే అని ఫిక్స్ అయ్యాను. ఇందులో ఆయన కేరెక్టర్లో రెండు షేడ్స్ వుంటాయి. ముందు విష్ణుకు డ్రెగ్ నేపథ్యంలో ఓ కథ చెప్పాను. అది భారీ సినిమా అవుతుందని మరో కథ చెప్పమన్నారు. అప్పుడు ఎఫ్.ఐ.ఆర్. చెప్పాను.మీ నేపధ్యం గురించి చెప్పండి?: నేను గౌతమ్ వాసుదేవ్ మీనన్ దగ్గర 8 సంవత్సరాలు పనిచేశాను. సత్యదేవ్, అజిత్, ధనుష్ (తూటా) కుప పనిచేశాను. ఇన్నేళ్ళ మీ జర్నీలో స్ట్రగుల్ పడిన సందర్భాలున్నాయా? ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరడమే చాలా కష్టమైంది. నాకు ఎటువంటి ఇండస్ట్రీ బేక్‌గ్రౌండ్ లేవు. నేను ఆస్ట్రేలియాలో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేశాను. నాకు సినిమాపై ఇంట్రెస్ట్‌తో 2011లో ఇండియా వచ్చాను. చెన్నైలో దిగి నా ప్రయత్నాలు నేను చేసుకున్నా.
ఇంత స్ట్రగుల్ పడిన మీరు ఎఫ్.ఐ.ఆర్. వంటి సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా?: రిస్క్ అనేది జీవితంలో ఓ భాగం ఏ రంగంలోనైనా వుంటుంది. నేను కార్పొరేట్ జాబ్ వదిలేస్తే ఫూలిష్ అన్నారు. ఆ తర్వాత నేను కొన్ని అడ్డంకులు అదిగమించాను. అయితే నేను ఎఫ్.ఐ.ఆర్.లో ఎటువంటి కాంట్రవర్సీని టచ్ చేయలేదు. ఒక ముస్లిం బాయ్ ప్రపంచాన్ని ఏ కోణంలో చూస్తాడు అనేది చూపించాను. ఇందులో ఏ మతానికి సంబంధించిన సినిమా కాదు. యాక్షన్, థ్రిల్లర్. హ్యూమన్ రిలేషన్స్, \డ్రామా కూడా వుంది. డైలాగ్స్ కూడా ఎవరినీ టార్గెట్ చేసినట్లు వుండవు.
మీకు నచ్చిన హీరో ఎవరు ?: నేను పవన్ కళ్యాణ్ డైహార్ట్ ఫ్యాన్‌ను. ఆయన సినిమా తప్పకుండా చూస్తా. అలాగే మహేష్‌బాబు సినిమాలు చూస్తా. పుష్ప సినిమా కూడా చెన్నైలో తెలుగు వర్షన్ చూశా.