విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి మోస్ట్ ఎవెయిటింగ్ ఫన్- ఫిల్డ్ ఎంటర్టైనర్ `ఎఫ్3`తో ఈ వేసవికి మూడు రెట్ల వినోదాన్ని అందించబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. థియేటర్స్‌లో ప్రేక్షకులని నవ్వులలో ముంచెత్తడానికి ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు ను విడుదల చేశారు. ఈ పాటలో డబ్బుకు ఉన్న శక్తి, గొప్పదనాన్ని వివరించారు. ఈ కథ డబ్బు చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ పాట కోసం దేవీ శ్రీ ప్రసాద్ చక్కటి బాణీని సమకూర్చారు. రామ్ మిర్యాల గాత్రం, భాస్కర భట్ల సాహిత్యం పాటను మరింత అందంగా మలిచాయి. విజువల్‌గా కూడా ఈ పాట ఎంతో స్టైలీష్‌గా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. శ్రోతలను ఈ పాట ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు భిన్న గెటప్స్‌లో కనిపిస్తున్నారు. ఈ పాటలో తమన్నా కూడా కనిపిస్తున్నారు. పాట చివర్లో సినిమాలోని నటీనటులంతా కూడా డబ్బు రావాలని చేసే ప్రార్థనలు అందరికీ నవ్వు తెప్పించేలా ఉంది.
నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ తదితరులు
సాంకేతిక బృందం: డైరెక్టర్: అనిల్ రావిపూడి, సమర్పణ: దిల్ రాజు, నిర్మాత: శిరీష్, బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి, సంగీత : దేవీ శ్రీ ప్రసాద్, కెమెరామెన్: సాయి శ్రీరామ్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్ ఎడిటింగ్: తమ్మిరాజు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: ఎస్ కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్