కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మహారాజా రవితేజ సగర్వ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్దు జొన్నలగడ్డ, సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా రవితేజ మాట్లాడుతూ.. ‘ఆరు నెలల క్రితం ఈ సినిమాను చూశాను. నాకు చాలా నచ్చింది. డిఫరెంట్ కంటెంట్ సినిమా. ఇలాంటి చిత్రం నాకు కూడా చేయాలని ఉంది. విష్ణు విశాల్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ‘త్వరలోనే తెలుగు నేర్చుకుంటాను. డైరెక్ట్ తెలుగు సినిమాను కూడా త్వరలోనే చేస్తాను. రవితేజ గారు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. రవితేజ వద్ద పని చేసే శ్వేతను పరిచయం చేసి ఇదంతా జరిగేందుకు కారణమైన జ్వాలకు థ్యాంక్స్. అభిషేక్ పిక్చర్స్ వారు ఈ సినిమాను చూశారు. థియేటర్లోనే ఈ సినిమాను విడుదల చేయాలని ముందే ఫిక్స్ అయ్యాం. ఓటీటీ అనే ఆలోచన ఎప్పుడూ పెట్టుకోలేదు. ఇప్పుడు కేవలం తమిళంలోనే కాదు తెలుగులోనూ సినిమాను విడుదల చేస్తున్నాం. మను అద్భుతమైన డైలాగ్స్ రాశారు. మంజిమా, మోనిక అద్భుతంగా నటించారు. గౌతమ్ సర్ సూపర్‌గా ఉంటారు. నీలో ఉన్న హీరోను ప్రేక్షకులు చూడాలి. దాన్ని నువ్ ఇంకా బయటకు తీసుకురావడం లేదు అని గౌతమ్ మీనన్ సర్ అన్నారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయకపోతే నేను నీతో మాట్లాడను అని గుత్తా జ్వాలా అన్నారు. నాకు సపోర్ట్‌గా నిలిచినందుక థ్యాంక్స్. సందీప్ కిషన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఫిబ్రవరి 11న రావాలని సడెన్‌గా నిర్ణయించుకున్నాం. చివరి క్షణాల్లోనే అంతా ఫిక్స్ అయ్యాం. చెప్పిన వెంటనే సందీప్ కిషన్ వచ్చారు. ఆయనకు థ్యాంక్స్. సిద్దు తన సినిమా రిలీజ్ ఉన్నా కూడా వచ్చి సపోర్ట్ చేశారు. రవితేజ గారు మా సినిమా చూసి మెచ్చుకున్నారు. ప్రెజెంట్ చేసేందుకు రెడీ అన్నారు. ఆయన నాకు బ్రదర్‌లా అనిపించారు. ఖిలాడీ సినిమాతో హీరోగా, ఈ సినిమాతో ప్రజెంటర్‌గా వస్తున్నాను అయితే ఏంటి? అని కూల్‌గా రిప్లై ఇచ్చారు. ఆయనకు థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులకు కంటెంట్ అంటే చాలా ఇష్టం. ఫిబ్రవరి 11న థియేటర్లోకి రాబోతోన్నాం. అందరూ చూడండి’ అని అన్నారు.