కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు విద్యాసంస్థలు నిర్వహిస్తోన్న గుదిబండి వెంకట సాంబి రెడ్డి నిర్మాతగా మారి శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ బేనర్ స్థాపించి తొలిసారిగా అలీ హీరోగా ‘పండుగాడి ఫొటోస్టూడియో’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తర్వాత తాజాగా మలయాళంలో రూపొందిన ‘పడి నెట్టం పడి’ చిత్రాన్ని ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. మమ్ముట్టి, ప్రియమణి, ఆర్య, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించింది. ఈ నెల 26న తెలుగులో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గుదిబండి వెంకట సాంబి రెడ్డి ఇంటర్వ్యూ జరిపింది.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు విద్యాసంస్థలు స్థాపించాను. సినిమా రంగంలోకి రావాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. అందులో భాగంగానే తొలి సినిమాగా పండుగాడి ఫొటోస్టూడియో చిత్రం నిర్మించాను. దాని తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 26న సినిమాను గ్రాండ్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాం.
మీరు గమనించినట్లైతే ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ నా స్కూల్ డేస్ అనే ట్యాగ్‌లైన్‌తోనే సినిమా స్టోరి ఏంటో చెప్పాము. స్టూడెంట్ దశ గురించి ఈ చిత్రంలో దర్శకుడు చాలా చక్కగా చూపించారు. విద్యార్థులకు సరైన గురువు దొరికితే వాళ్ల జీవితం ఎలా మారుతుంది. జీవితంలో వాళ్లు ఎంత ఎత్తుకు ఎదగగలరు అనే చక్కటి సందేశం ఈ సినిమాలో ఉంటుంది. అలాగే ప్రభుత్వ కళాశాలకు చెందిన స్టూడెంట్స్‌ను కార్పోరేట్ విద్యాసంస్థలకు చెందిన స్టూడెంట్స్ చిన్న చూపు చూడటం. ఇలాంటి క్రమంలో ఒక ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మంత్రితో పందెం కట్టటం ఆ విద్యార్థులు ఆ పందెం లో ఎలానెగ్గారు.. చివరికి ఆ మంత్రి ఏం చేశాడు అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో కొత్తగా, ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు మలిచిన తీరు అత్యద్భుతం అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు.ఇక ఆచార్యుని పాత్రలో మమ్ముట్టి గారు ఎక్స్‌లెంట్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. తను స్టూడెంట్స్‌ని ఇన్‌స్పైర్ చేసే విధానంగానీ, వారి అభివృద్దికి తోడ్పడే అంశాలుగానీ నిజ జీవితంలో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్‌తో పాటు ప్రతి తల్లీదండ్రి కచ్చితంగా చూసి తీరాల్సిన అవసరం ఉంది.
వర్షంలో వచ్చే బస్సు ఫైట్, సైకిల్ మీద ఫైట్ అలాగే ఏఆర్ రహమాన్ గారి మేనల్లుడు ఏహెచ్ కాశీఫ్ అద్భుతమైన ఐదు పాటలు కంపోజ్ చేశారు. ప్రతి పాట ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఇప్పటికే ఒక పాట రిలీజ్ చేశాం. యూట్యూబ్‌లో ఆ సాంగ్ చాలా బాగా పోతుంది. సంగీతంతో పాటు సినిమటోగ్రఫీ, దర్శకుడి టేకింగ్ , మమ్ముట్టి, ప్రియమణి, ఆర్య, పృధ్వీరాజ్ గారి నటన సినిమాకు హైలెట్‌గా నిలిచే అంశాలు. అలాగే బాహుబలి చిత్రానికి పని చేసిన కెచ్చ ఈ చిత్రానికి అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేశారు. ఈ ఫైట్స్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.
చైతన్య ప్రసాద్, శ్రేష్ణ, కృష్ణ మాదినేని ఇందులో పాటలు రాశారు. అలాగే మైథిలి కిరణ్, దీపిక రావ్ సంభాషణలు సమకూర్చారు. అందరూ కలిసి డబ్బింగ్ సినిమాలా కాకుండా తెలుగు స్ట్రయిట్ సినిమాలా ఎంతో క్వాలిటీ వర్క్ ఇచ్చారు. ఫైనల్‌గా ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం. మీకు కచ్చితంగా నచ్చుతుంది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు.