అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటించిన సినిమా `హీరో`. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పద్మావతి గల్లా నిర్మాత. జగపతిబాబు, నరేశ్ ,బ్రహ్మాజీ, మైమ్ గోపీ, రోల్ రిడా తదితరులు నటించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా అశోక్ గల్లా మాట్లాడుతూ… మొదటిరోజు దేవీ థియేటర్ లో చూశాక ప్రేక్షకుల పాజిటివ్ స్పందన ఇంకా మర్చిపోలేకపోతున్నా. అందుకే సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా ఇష్టం గ్రహించి నన్ను ఇంతవరకు తీసుకువచ్చిన అమ్మా, నాన్నలకు థ్యాంక్స్. అలాగే దర్శకులటీమ్‌కు థ్యాంక్స్. బగపతిబాబుగారు చాలా బాగా చేశారు. బ్రహ్మాజీ క్లయిమాక్స్‌లో అదిరిపోయేలా నటించారు. అలాగే నరేష్, మైమ్ గోపీ, రోల్ రిడా పాత్రలు ఎంతగానో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. నిధి లక్కీచామ్‌గా తయారైంది. డాన్స్ పరంగా నాకు విజయ్ శిక్షణ ఇచ్చాడు. ఆయన చేసిన పాటలకు థియేటర్లలో మంచి ఆదరణ లభిస్తోంది. అన్నారు.