అశోక్ గల్లా. నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలయి పాజటివ్ టాక్ ను సంతరించుకుంది. ఈ సందర్భంగా శనివారంనాడు చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ తమ ఆనందాన్ని సంస్థ కార్యాలయంలో విలేకరులతో పంచుకున్నారు.
చిత్ర నిర్మాత శ్రీమతి గల్లా పద్మావతి మాట్లాడుతూ… ఈరోజు దేవీ థియేటర్‌లో చూశాం. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పాజిటివ్ టాక్ తొలి సినిమాకు రావడం ప్రోత్సాహంగా వుంది. అందుకే ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేయాలనుకున్నాం. అందరికీ కామెడీ బాగా నచ్చింది. హిలేరియస్ కామెడీ, థ్రిల్లింగ్ మూవీ ఇది. పేండమిక్ టైమ్‌లో కాస్త రిలీఫ్‌గా వుండే సినిమానే `హీరో` చిత్రం. సంక్రాంతికి పండుగ చేసుకుంటూ మా హీరో సినిమాను చూసి మరింత ఎంజాయ్ చేయండని అన్నారు.