కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా గురువారం నాడు బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ.. ‘సంక్రాంతి పండుగ సినిమా ప్రేక్షకులు ఫెవికాల్‌లా అతుక్కుని ఉంటారు. అలాంటి సంక్రాంతికి మన సినిమా లేకపోతే ఎలా. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని నేను ఎంత పట్టుబట్టానే నా టీం ఎక్కువగా పట్టుబట్టింది. ఈ సినిమాలో నేను, చై మీసం తిప్పుతాం. రేపు మీరు (ఆడియెన్స్) కూడా సినిమా చూసి మీసం తిప్పుతారు. వాసివాడి తస్సాదియ్యా. నా ఎడిటర్ విజయ్ మూడు నెలలుగా నిద్రకూడా పోలేదు. జునైద్ చేసిన వీఎఫ్ఎక్స్ చేసిన పనిని ఎప్పటికీ మరిచిపోను. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కథలో భాగంగా ఫైట్స్ కంపోజ్ చేశారు. యువరాజ్ నా డైమండ్. ఆయన లేకపోతే ఇదంతా జరిగేది కాదు. అనూప్ లడ్డుండా వంటి అద్బుతమైన పాటలు ఇచ్చాడు. బ్రహ్మ కడలి మాత్రం టైంకి సెట్‌లో వేసి ఇచ్చాడు.
ఇంత అద్బుతమైన స్క్రిప్ట్ ఇచ్చిన కళ్యాణ్‌కి థ్యాంక్స్. ఇంత పెద్ద సినిమా, ఇంత మంది ఆర్టిస్ట్‌లను హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. నవ్వుతూనే అందరితో పని చేయించుకున్నాడు. జీ స్టూడియోస్ ప్రసాద్ ఇచ్చిన సపోర్ట్‌కు థ్యాంక్స్. మా సర్పంచ్ నాగలక్ష్మీ ఇక్కడ లేదు. కానీ అద్బుతంగా నటించింది. కొత్త నాగ చైతన్యను ఈ సినిమాలో చూస్తారు. చాలా బాగా నటించాడు. కంప్లీట్‌గా ఓపెన్ అప్ అయి నటించాడు. బ్లాక్ బస్టర్ సక్సెస్ పార్టీ రోజు అందరి గురించి చెబుతాను. పర్మిషన్ లేకపోవడంతో ఎక్కువ మందిని పిలవలేకపోయాను. సక్సెస్ మీట్‌లో అందరినీ కలుద్దాం’ అని అన్నారు.