కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా అక్కినేని నాగార్జున మీడియాతో ముచ్చటించారు.
చిన్న బంగార్రాజుతో ఈ సంక్రాంతికి వస్తున్నాం. సోగ్గాడేలో యూత్ బంగార్రాజుని మిస్ అయ్యాం. నాగచైతన్య ఎంట్రీతో యూత్‌ఫుల్ ఎనర్జీ ఎంట్రీ కూడా వచ్చినట్టు అయింది. సోగ్గాడే చాలా బాగా ఆడింది. అందరూ సినిమాను అంగీకరించారు. అది మకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆ సినిమా నచ్చిన వాళ్లు బంగార్రాజును చూడాలని అనుకుంటారు. అయితే ఆ సినిమా కంటే బాగుండాలి. అన్నింటి కంటే ఎక్కువగా నాగ చైతన్య రావడంతో మరింత బాధ్యత పెరిగింది. సంక్రాంతికి పండుగలాంటి సినిమా ఇస్తున్నామని ప్రేక్షకులకు మాటిచ్చాం. అది ఇంకా పెద్ద బాధ్యత.
బంగార్రాజు సినిమాలో నాగ చైతన్యను చూసి సర్ ప్రైజ్ అవుతారు. లవ్ స్టోరీ, మజిలీ చిత్రాలు చేశాడు. ఇప్పుడు ఇందులో ఉన్నది నాగ చైతన్యనేనా? అని ఆశ్చర్యపోతారు. ఈ సినిమా విషయంలో ముందు నుంచి కూడా చై అనుమానంగానే ఉన్నాడు. నన్ను నమ్ము అని చెప్పాను. ఇప్పుడు అదొక బాధ్యతగా మారింది. చైతూ రూరల్ బ్యాక్ డ్రాప్‌లో చేసిన మొదటి సినిమా ఇదే.బంగార్రాజు కారెక్టర్‌లో సరసం ఉంటుంది. సరసమంటేనే బంగార్రాజుకు ఇష్టం. తాత పోలికలు కొడుక్కంటే ఎక్కువగా మనవడికి వస్తాయంటారు. ఆ పాయింట్ పట్టుకునే బంగార్రాజుని చేశాం. నాన్న గారు రొమాంటికా? నేను రొమాంటికా? అని అంటే.. ఎవరి కాలంలో వాళ్లు రొమాంటిక్ (నవ్వులు)