యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. నవంబర్ 26న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డుగా కనిపించనున్నారు. సెక్యూరిటీ గార్డుల మీద తెరకెక్కిన మూడో పాటను హైదరాబాద్‌లోని ఏఎంబి మాల్ లో సెక్యూరిటీ గార్డుల సమక్షంలో విడుదల చేశారు. బతికే హాయిగా అంటూ సాగిన ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యాన్ని అందించగా..దీపు ఆలపించారు. గోపీ సుందర్ అందించిన బాణీకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
రాజ్‌తరుణ్ మాట్లాడుతూ.. ‘మామూలుగా మనం సెక్యురిటీ గార్డ్స్ అంటే ఏంటి.. అలా నిల్చుంటారు.. రాత్రంతా ఉంటారు కష్టపడతారు అని అనుకుంటాం. కానీ దాని వెనకాల ఉండే ప్రిపరేషన్స్ ఏంటో నాకు ఈ సినిమా చేసినప్పుడే అర్థమైంది. వాళ్ల ట్రైనింగ్ ఎలా ఉంటుంది.. వారు ఎంత కష్టపడతారో తెలిసింది. వారందరికీ హ్యాట్సాఫ్. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా. కచ్చితంగా అందరూ ఎంటర్టైన్ అవుతారు’ అని అన్నారు.
నటీనటులు : రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, పోసాని కృష్ణమురళీ, ఆడుకాలమ్ నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి కృష్ణ, భూపాల్ రాజు, అరియానా
సాంకేతిక బృందం:
రచయిత, దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
బ్యానర్స్: అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి
సంగీతం: గోపీ సుందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆనంద్ రెడ్డి కర్నాటి
సినిమాటోగ్రఫర్: నాగేష్ బానెల్
ఎడిటర్: చోటా కే ప్రసాద్
లిరిక్స్: భాస్కర భట్ల
ఆర్ట్ డైరెక్టర్: సుప్రియ బట్టెపాటి, రామ్ కుమర్
కొరియోగ్రఫర్: విజయ్ బిన్నీ
ఫైట్ మాస్టర్: రియల్ సతీష్
క్యాస్టూమ్ డిజైనర్: రజినీ.పి
కో డైరెక్టర్: సంగమిత్ర గడ్డం
పీఆర్వో: వంశీ-శేఖర్