Monument to Heavenly Sri Mekapotula Lingayya – PET Gaari Village Level Kabaddi Competitions in “Potlapahad” Village, Pen Pahad Mandal, Suryapeta District, Telugu world Now.
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం “పొట్లపహాడ్” గ్రామంలో దసరా పండుగ సందర్భంగా స్వర్గీయ మేకపోతుల లింగయ్య PET గారి స్మారక గ్రామ స్థాయి కబడ్డీ ఆటల పోటీలు ఈరోజు జరిగాయి. విజేతలకు ప్రధమ, ద్వితీయ బహుమతులు లింగయ్య ఫ్యామిలీ బహుకరించారు. తదుపరి సాయంత్రం 7 గంటలకు ‘శతమానం భవతి’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని 90 ఏళ్ళు పైబడిన 20 మంది వయోవృద్ధులకు నూతన వస్త్రాలు సమర్పించి వారికి సన్మానించడం జరుగింది. తదుపరి పిల్లల కల్చరల్ ప్రోగ్రాంలో పిల్లలచే డాన్స్ ప్రోగ్రాం నిర్వహించనైనది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్ వచ్చారు. ఈ కార్యక్రమాలలో గ్రామ సర్పంచ్ రామినేని పుష్పవతి, ఎంపీటీసీ మేకపోతుల సైదమ్మ సీతారాములు, ఉప సర్పంచ్ దాచేపల్లి నాగయ్య, ఈ కార్యక్రమాలు పొట్లపహాడ్ గ్రామ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగాయి. సమాఖ్య సభ్యులు మేకపోతుల శంకర్, యగ్గడి శ్రీనివాస్, యడవెళ్లి ప్రభాకర్ రెడ్డి, లక్ష్మరెడ్డి, LIC సైదులు, సంపత్, అరవింద్, కిరణ్, డాక్టర్ దాచేపల్లి సుధీర్, డాక్టర్ పుట్టల సత్య సోమ మల్లికార్జున్, జిల్లేపల్లి జానయ్య, యడవెళ్లి లక్ష్మారెడ్డి, మేకపోతుల అజయ్ తదితరులు పాల్గొన్నారు.