తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ ముప్పై తారీఖున జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలపై ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. అధికార టీఆర్ఎస్ తరపున బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంకట్ బల్మూర్,బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు.
దరువు నిర్వహించిన ఈ సర్వేలో గెలుపు ఎవరిది.. ఓట్లు ఎవరికి వేస్తారు.. ఎవరు గెలుస్తారు అనే అంశాలపై అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టినట్లు ఆర్ధమవుతుంది.
ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలినాళ్లలో ఆయనకు 65-70% ప్రజలు అండగా ఉన్నారు.తాజాగా ఆయన వెంట 40%మంది ప్రజలే ఉన్నారని ఆర్ధమవుతుంది. అయితే ఇది రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది. ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు నిర్వహించిన ఈ సర్వేలో తేలింది.
దళిత సామాజికవర్గానికి చెందినవారు 80%, గొల్లకుర్మల సామాజికవర్గానికి చెందినవారు 80%, గౌడలలో 60% ముదిరాజ్ లలో 25% పద్మశాలిలు 60%, రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు 60 %మైనార్టీ వర్గానికి చెందిన వారు 80%మంది మొత్తంగా 47%ప్రజలు టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపుతున్నారని తేలింది. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పదివేల ఓట్ల మెజార్టీతో గెలుపు బావుటా ఎగరవేయనున్నది అని తేలింది. సొంత ఇలాఖాగా భావిస్తున్న ఈటలకు కమలాపూర్ లో ఎదురుగాలి వీస్తుంది. దరువు నిర్వహించిన సర్వేలో కూడా కమలాపూర్ లో ఈటలకంటే టీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపారు. ఒక్క జమ్మికుంటలోనే 1000ఓట్లు ఈటల కంటే టీఆర్ఎస్ కే వచ్చే అవకాశం ఉందని తేలింది. మిగతా మండలాలు అయిన ఇల్లంతకుంట ,వీణవంక ,హుజురాబాద్ లో టీఆర్ఎస్ హావానే ఉంది.
ఇకపోతే బీజేపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వైపు గౌడ సామాజికవర్గానికి చెందిన వారు 40% ,ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు 75%పద్మశాలి వర్గానికి చెందిన వారు 40%,రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు 40%మైనార్టీ వర్గానికి చెందినవారు 20%మొత్తంగా 40% మంది ఓటర్లు మొగ్గుచూపారు అని తేలింది.
మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేవలం 12-15% మాత్రం జైకొట్టారు. గత ఎన్నికల్లో ఆరవై వేల ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి డిపాజిట్లు కూడా దక్కవని ఆర్ధమవుతుంది. అయితే గడిచిన నాలుగు నెలల నుండి దరువు తీసుకున్న 5000 పబ్లిక్ బైట్స్ తో ఈ సర్వే చేసింది. గత ఆరేండ్లుగా దరువు సంస్థ నిర్వహించిన ఏ సర్వే కూడా తప్పలేదు.అన్ని ఎన్నికల్లో దరువు నిర్వహించిన సర్వేలన్నీ నిజమయ్యాయి. ఈసారి కూడా దరువు సర్వే తప్పదు..