Huzurabad News: రికార్డులకు రారాజైన ట్రబుల్ షూటర్ – మంత్రి హరీష్ రావు ఎంట్రీ.. ఈటల రాజేందర్ భేజారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హుజూరాబాద్ లో ఎంట్రీవ్వడంతో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ వెన్ను వణుకు పుట్టిందా..?. విజయాలకు కేరాఫ్ అడ్రస్.. రికార్డులకు రారాజైన ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఎంట్రీతో తనకు ఓటమి ఖాయమైందని ఈటలకు ఆర్ధమయిందా..?. గెలుపు సంగతి పక్కనెట్టు కనీసం తనకు డిపాజిట్లైన దక్కుతాయా అనే సందిగ్ధంలో ఈటల పడిపోయాడా..? అంటే ప్రస్తుతం ఈటల రాజేందర్ & బ్యాచ్ ప్రవర్తిస్తున్న తీరును బట్టి నిజం అనే చెప్పాలి…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ పార్టీ తరపున ఉద్యమ కారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన రోజు మంత్రి హరీష్ రావు నిర్వహించిన భారీ బైకు ర్యాలీతో మొదలైన ట్రబుల్ షూటర్ రాజకీయ ఎత్తుగడలు తాజాగా ఇటీవల ఈటల సొంత ఇలాఖాలో నిర్వహించిన భారీ బైకు ర్యాలీతో ఈటల రాజేందర్ వెన్నులో ఓటమి భయం పట్టుకుంది..
దళితబంధుతో హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులంతా టీఆర్ఎస్ వైపు ఉండటంతో ఈటల రాజేందర్ కు ఓటమి భయం పట్టుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా గత ఏడేండ్లలో మంత్రిగా.. ఎమ్మెల్యేగా ఉండి ఈటల రాజేందర్ చేయని అభివృద్ధి ఈ రెండు మూడు నెలలోనే మంత్రి హరీష్ రావు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధితో అప్పటికిప్పుడు ఉన్న తేడాను ప్రజలు గమనించి చైతన్యవంతులవుతుండటంతో కూడా ఈటల రాజేందర్ కు మైనస్ గా మారింది..
మొదట్లో ఈటలకు ఉన్న నాయకుల మద్ధతు.. ప్రజల నుండి స్పందన క్రమక్రమంగా తగ్గుతుంది.వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని ఈటల రాజేందర్ పై ప్రజల నుండి వ్యతిరేకత ఎక్కువైంది.గత రెండు నెలలుగా మంత్రి హరీష్ రావు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా… అనుసరిస్తున్న రాజకీయ వ్యూహ ప్రణాళికల అమలు ఫలితంగా ఈటలకు ఓటమి ఖరారైందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.