అర్హులైన ప్రతిఒక్కరికీ దళితబంధు పథకం వర్తిస్తుందని మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని దళితులకు సూచించారు. ఆదివారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండవ, సీతంపేట, నాగులవంచ తదితర గ్రామాల్లోని దళిత కాలనీలను సందర్శించి స్థానికుల తో మాట్లాడారు.
దళితబంధుతో ఎస్సీల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయన్నారు. చింతకాని మండలంలోని దళిత కాలనీల్లో నెలకొ న్న సమస్యలను సీఎం కేసీఆర్‌కు వివరించానని, త్వరలో పరిష్కారం లభిస్తుందన్నారు. లబ్ధిదారులకు తాము కోరుకున్న యూనిట్లు అందుతాయని తెలిపారు. ప్రభుత్వం త్వరలో పలు విభాగాల్లో గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తుందన్నారు.