National Agricultural Seminar, Amitabh Kundu, Ravindra Dhariya, Boinapally Vinod Kumar, Role of Civil Society for Paradigm Shift Towards Structurall Changes for Sastenable Agricultural Value Chain Opportunities Ahead, Amul Milk, Karimnagar Dairy, Telugu World Now,
Telangana News: అమూల్ పాలు విక్రయించిన తర్వాత తద్వారా తయారు చేసే స్వీట్లు, పెరుగు, ఇతర పానీయాల విక్రయాల్లో కూడా రైతులకు షేర్
పంట ఉత్పత్తి ధర సహా తద్వారా జరిగే ఉత్పాదకాలలో ( ప్రోడక్ట్స్ ) కూడా రైతుకు లాభాలు ( షేర్ ) దక్కాలి, జాతీయ వ్యవసాయ సెమినార్ లో నిపుణుల అభిప్రాయం
ఈ సెమినార్ లో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి సోంపాల్ శాస్త్రీ, వ్యవసాయ రంగ నిపుణులు అమితాబ్ కుండు, రవీంద్ర ధారియా, రాజ్ వీర్ శర్మ, కే కే త్రిపాఠి, జీ అగర్వాల్, వినీత హరిహరన్, ఖుషీ రాధ్య, మోహన్ కందా, బినోద్ ఆనంద్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సీజీజీ డీజీ రాజేంద్ర నింజే, డైరెక్టర్ జువ్వాడి దేవీప్రసాద్
రైతులు తాము పండించిన పంటలను మార్కెట్ లో విక్రయించిన తర్వాత ఆ పంటల ద్వారా తయారు చేసే వస్తు, ద్రవ రూప ఉత్పత్తులపై కూడా రైతులకు లాభాలు ( షేర్ ) దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయ పడ్డారు.
శనివారం జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో ” రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ ఫర్ పరడిజం షిఫ్ట్ టువార్డ్స్ స్ట్రక్చరల్ చెంజెస్ ఫర్ సస్తేనేబుల్ అగ్రికల్చరల్ వ్యాలు చైన్ – ఆపర్చునిటీస్ అహీడ్ ” అనే అంశంపై జరిగిన జాతీయ సెమినార్ లో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు.
రైతులకు ఆర్థికంగా మేలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, అందుకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పన కోసం ఈ జాతీయ వ్యవసాయ సెమినార్ లో నిపుణులు చర్చించారు.
ఉదాహరణకు అమూల్ పాలు విక్రయించిన తర్వాత తద్వారా తయారు చేసే స్వీట్లు, పెరుగు, ఇతర పానీయాల విక్రయాల్లో కూడా రైతులకు షేర్ దక్కుతోందని, ఇదే తరహా పద్దతి అన్ని వ్యవసాయ ఉత్పత్తులలో అమలు కావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయ పడ్డారు.
అమూల్ తరహాలోనే కరీంనగర్ డైరీ లోనూ అమలు జరుతుండటం సంతోషకరమైన విషయమని వారు తెలిపారు.ఇలాంటి పరిస్థితులు ఆచరణలోకి వస్తే రైతులకు ఆర్థిక భరోసా ఉంటుందని వారు తెలిపారు.
రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఆచరణలోకి వచ్చేలా దేశ వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టం చేశారు.
వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు వచ్చేందుకు రైతు ఉత్పాదక సంస్థలను ( F.P.O ) ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించారు.రైతులు సమిష్టిగా ఉంటే గిట్టుబాటు ధరలు పొందవచ్చని, పంటల సాగు విషయంలో కూడా కొత్త దనాన్ని ఆవిష్కరణ చేయవచ్చని నిపుణులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని, ఇది హర్షించదగిన పరిణామం అని నిపుణులు అన్నారు. రైతుల కోసం పరితపిస్తున్న సీఎం కేసీఆర్ అభినందనీయులు అని వ్యవసాయ రంగ జాతీయ నిపుణులు పేర్కొన్నారు.
ఈ సెమినార్ లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల, వ్యవసాయ, విద్యుత్ రంగాల్లో చేపట్టిన విప్లవాత్మక చర్యల వల్ల ఆయా రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ అర్త్ నీతి నివేదికలో స్పష్టంగా పేర్కొందని వినోద్ కుమార్ తెలిపారు. వ్యవసాయ, దాని అనుబంధ సంస్థలలో తెలంగాణ ఆవిర్భావం ముందు రెండు శాతం ఉన్న గ్రోత్ ప్రస్తుతం 16.5% శాతానికి చేరుకుందని అన్నారు. వ్యవసాయం, ఫిషరీస్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీలో రూ. 76, 123 కోట్ల నుంచి ప్రస్తుతం రూ. 1, 84, 321 కోట్లకు తెలంగాణ రాష్ట్రం చేరిందని వినోద్ కుమార్ తెలిపారు. వరి స్థూల విలువ రూ. 9, 528 కోట్ల నుంచి రూ. 47, 440 కోట్లకు చేరిందని, కందుల విలువ రూ. 530 కోట్ల నుంచి రూ. 3,808 కోట్లకు చేరిందని, తలసరి ఆదాయం రూ. 1,24,104 నుంచి రూ. 2,37,632 కు చేరిందని అన్నారు.
ఈ సెమినార్ లో కేంద్ర మాజీ మంత్రి సోంపాల్ శాస్త్రీ, వ్యవసాయ రంగ నిపుణులు అమితాబ్ కుండు, రవీంద్ర ధారియా, రాజ్ వీర్ శర్మ, కే కే త్రిపాఠి, జీ అగర్వాల్, వినీత హరిహరన్, ఖుషీ రాధ్య, మోహన్ కందా, బినోద్ ఆనంద్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సీజీజీ డీజీ రాజేంద్ర నింజే, డైరెక్టర్ జువ్వాడి దేవీప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.