Salla Divya Reddy Foundation Distributes Daily Essentials, Covid News, Telangana News, Telugu World Now,
ఎవరైనా ఆపదలో ఉన్నాను అంటే నేనున్నానని భరోసా ఇచ్చే సల్లా దివ్యా రెడ్డి ఫౌండేషన్.
ఆపద అంటే అండగా ఉంటారు..కష్టమంటే నేనున్నాననే భరోసానిస్తారు..కులం చూడరు..మతం చూడరు.. చూసేది ఒక్కటే ఎదుటివాళ్లు కష్టాల్లో ఉన్నారా అనే సంగతి..ఎవరు ఏ కష్టంలో ఉన్న కానీ నేనున్నానని దివ్యారెడ్డి ఫౌండేషన్ అనే స్వచ్చంద సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు సల్లా దివ్యారెడ్డి. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్ నందు ఉన్న మొత్తం 1000మంది విద్యార్థులకు ,ఉపాధ్యాయులకు, సిబ్బందికి మాస్కులతో పాటు శానిటైజర్ బాటిల్స్ ను తన ఏడేళ్ల కుమారుడు సల్లా అరన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు..
అనంతరం సల్లా దివ్యారెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.తప్పనిసరిగా చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో కడుక్కోవాలి.. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లకూడదు..ఒకవేళ వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్కులను ధరించాలని తెలిపారు కరోనా మూడో వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుంది కాబట్టి పిల్లలను కరోనా మహమ్మారి భారిన పడకుండా కాపాడుకోవడం మన బాధ్యత అని ఆమె వివరించారు.