Minister KTR Speech Hilights in Jalavihar, KTR Comments on BJP Leaders, Telangana Political News, Minister Talasani Srinivas Yadav, CM KCR, Telugu World Now,
ఏడేళ్లు ఓపిక పట్టాం – కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు సమాధానం చెప్తామ్: మంత్రి కేటీఆర్
టీ ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ,మంత్రి కేటీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు @హైదరాబాద్ టీ ఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశం ,జలవిహార్
*తెలంగాణ ఉద్యమాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం ఆనాడు కాంగ్రెస్ కుట్ర చేసింది- కేటీఆర్*
*తెలంగాణ కోసం కేసీఆర్ ఒకే ఒక్కడుగా ఆనాడు బయలుదేరాడు*
*టీఆరెస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి*
*కేసీఆర్ తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు కేసీఆర్*
*2004 కాంగ్రెస్ తో – 2009లో టీడీపీ తో పొత్తుపెట్టుకొని తెలంగాణకు అనుకూలంగా మాట్లాడించారు కేసీఆర్*
*2004లో తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చి 2009లో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ మాట తప్పింది*
*కేసీఆర్ దీక్షకు దిగిన తరువాత విధిలేక కాంగ్రేస్ తెలంగాణ ఇచ్చింది- కేసీఆర్*
*ఇవ్వాళ ఎగిరిపడుతున్న చిల్లర- మల్లర మాటలు మాట్లాడుతున్న వాళ్ళను ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు కానిర్రు*
*నిన్న మొన్న పుట్టిన చిల్లర గాళ్ళు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు*
*70ఏళ్లలో జాతీయ పార్టీలు అని చెప్పుకునే వాళ్ళు నీళ్లు- కరెంటు ఎందుకు ఇవ్వలేదు?*
*ఏడేళ్లు ఓపిక పట్టాం- కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు సమాధానం చెప్తామ్
*ఇక నుంచి ఒక్కటి అంటే పదిగా సమాధానం చెప్తం*
*ఉరుకుంటే చిల్లర గాళ్ల మాటలు ఎక్కువగా అయితున్నాయి- కేటీఆర్*
*విమర్శలు చేసే వాళ్ళను అంగట్ల కొత్త వేశగాళ్లను చూసినట్లు ప్రజలు వాళ్లను చూస్తున్నారు*
*హుజురాబాద్ ఎన్నిక చిన్న ఎన్నిక- లోకల్ నేతలు చూసుకుంటారు*
*ప్రతిపక్షాలను ధీటుగా తిప్పుకొట్టే రంగం సిద్ధం చేద్దాం*
*సెప్టెంబర్ 20వ తేదీ లోపు బస్తీ- కాలనీ కమిటీలు పూర్తి కావాలి*
*150 డివిజన్ కమిటీలు వెయ్యాలి*
*పార్టీలో మొదటి నుంచి కష్టపడుతున్న సోదరులు ఉన్నారు*
*అసంతృప్తిగా ఉన్న వాళ్లందరికీ త్వరలోనే పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తాం*
*త్వరలో 500 వందల పోస్టులు వివిధ కార్పొరేషన్లు నింపే బాధ్యత తీసుకుంటా*
*150 డివిజన్లకు సోషల్ మీడియా కమిటీ వేద్దాం*
*హైదరాబాద్ లో అందరికి అందుబాటులో ఉండే విదంగా హైదరాబాద్ పార్టీ ఆఫీస్ కట్టుకుందాం*
*75 ఏండ్లలో గత ప్రభుత్వాలు మూడు హాస్పిటల్స్ మాత్రమే కట్టాయి*
*దాశరథి అన్నట్లు తెలంగాణ కోటి రతనాల వీన అన్నట్లు- కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయింది*
*టీఆరెస్ ను ఎవ్వరూ- ఏ పార్టీ అడ్డుకోలేదు*
*దసరా తరువాత శిక్షణా కార్యక్రమాలు పెట్టుకుందాం*
*పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరినీ గుర్తిస్తాం