Drugs Mafia in Tollywood, Producer Natti Kumar, Tollywood Drugs issue News, Telugu Film industry Drugs issue, Telugu World Now,
Tollywood News: డ్రగ్స్ ఆరోపణలు సినీ పరిశ్రమకే ఎందుకు చుట్టుకున్నాయో ఆలోచించాలి: నట్టికుమార్
డ్రగ్స్ ఆరోపణలు సినీ పరిశ్రమకే ఎందుకు చుట్టుకుంటున్నాయో ప్రతీఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ దర్శక, నిర్మాత నట్టి కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో తన దర్శకత్వంలో రూపొందిన ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం)..చిత్రం ఐదు భాషల ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నట్టికుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పరిశ్రమలోని పలు అంశాలు ప్రస్తావిస్తూ…
డ్రగ్స్ కేసులను చిత్ర పరిశ్రమలోని వారే ఎదుర్కొంటున్నారు. దీనిపై వాస్తవాలు బయటకు రావాలి. మొదటి సినిమా విజయం సాధిస్తే పారితోషికాలు అమాంతం పెంచేస్తున్నారు. దీనికంతా కారణం డేట్లు చూసే మేనేజర్లు. కేవలం తమ స్వార్ధం కోసం వారు 35 శాతం ఆర్టిస్టుల పారితోషికంలో పర్సెంటేజ్ లు పుచ్చుకుని పరిశ్రమను దిగజారుస్తున్నారు.
కొందరు ఆర్టిస్టుల మేనేజర్లు కోట్లు సంపాదించారు. అంతేకాదు ఒక మేనేజర్ అయితే స్టూడియోలో పార్టనర్ స్థాయికి కూడా ఎదిగాడు. అందుకే డ్రగ్స్ ఆరోపణలలో కొందరు మేనేజర్లను విచారించి,, వారి బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తే డ్రగ్ మాఫియా ఆనవాళ్లు కూడా బయటకు వస్తాయి. చిన్న సినిమాల మనుగడ కోసం 35 జీవోను కొనసాగించాలి, అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా 35 జీవో ను ప్రవేశపెట్టాలి” అని అన్నారు.