Nagarjuna, Praveen Sattaru’s Film Second Schedule Commences From August 4 In Hyderabad, Kajal Aggarwal, Latest Telugu Movies, Telugu World Now,
FILM NEWS: ఆగస్ట్ 4 నుంచి కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు మూవీ సెకండ్ షెడ్యూల్
కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో హై రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోవాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ మంగళవారం(ఆగస్ట్ 4) నుంచి హైదరాబాద్‌లో ప్రారంబం కానుంది.
ఇండియాలోని ప్రధాన నగరాలు, విదేశాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేలా ప్లాన్ చేశారు. నాగార్జున ఈ చిత్రంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. గుల్ పనాంగ్, అనైకా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముకేశ్.జి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ఆర్ట్, రాబిన్ సుబ్బు, నభా మాస్టర్ యాక్షన్ డైరెక్టర్స్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు:
నాగార్జున అక్కినేని, కాజల్ అగర్వాల్, గుల్ పనాంగ్, అనైకా సురేంద్రన్ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోన్‌రావు, శరత్ మరార్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేశ్.జి
యాక్షన్: రాబిన్ సుబ్బు, నభా మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్, బి.ఎ.రాజు