Lakshya’sFriday Poster, Naga Shaurya’s ‘LAKSHYA’ To Come Up With Update On Every Friday, Ketika Sharma, Jagapathi Babu, Telugu World Now,
FILM NEWS: ప్రతి శుక్రవారం ఒక కొత్త అప్డేట్‌తో రానున్న నాగశౌర్య “లక్ష్య”
టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్న నాగశౌర్య 20వ చిత్రం ‘లక్ష్య’. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలోఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తలుక్‌లో కనిపించనున్నారు నాగశౌర్య.
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ నటిస్తున్నారు.
ఈ మూవీ చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. అలాగనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. #LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్ పేరుతో ప్రతీ శుక్రవారం లక్ష్య మూవీ నుండి ఒక కొత్త అప్డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్.
సాధారణంగానే సినీ ప్రేమికులు ప్రతిశుక్రవారం ఒక అప్డేట్ కోసం ఎదురుచూస్తుంటారు కాబట్టి ఈ కొత్త తరహా ప్రమోషన్స్ తప్పకుండా సినిమాపై అంఛనాలను పెంచనున్నాయి.
తారాగణం: నాగశౌర్య, కేతికశర్మ, జగపతి బాబు,సచిన్ ఖేడేకర్
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ధీరేంధ్ర సంతోష్ జాగర్లపూడి
నిర్మాతలు: నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్
సినిమాటోగ్రాఫర్: రామ్‌రెడ్డి
సంగీతం: కాలబైరవ
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
పిఆర్ఓ: బి.ఎ.రాజు, వంశీ -శేఖర్.