Adavallu Meeku Joharlu Movie, Music Devi Sri Prasad, Hero Sharvanand, Heroine Rashmika Mandanna, Tirumala Kishore, Latest Telugu Movies, Telugu World Now,
FILM NEWS: శర్వానంద్, తిరుమల కిషోర్, ఎస్ ఎల్ వి సినిమాస్ ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో మ్యూజిక్ డైరక్టర్ గా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్
శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల.
ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండనున్నాయని, కిశోర్ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిన్నారని. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలోని ఫీమేల్ క్యారెక్టర్స్ మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్ ప్రసాద్ ఎడింటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకు సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్.
నటీనటులు: శర్వానంద్, రష్మికా మందన్నా, ‘వెన్నెల’ కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్‌సీఎమ్ రాజు తదితరులు…
సాంకేతిక విభాగం:
దర్శకుడు: తిరుమల కిశోర్
ప్రొడ్యూసర్: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సంగీతం; దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్
కొరియోగ్రాఫర్: దినేష్
పీఆర్‌వో: వంశీ – శేఖర్