Ja Movie Trailer Released by Hero Sudheer Babu, Pratap Raju, Saidi Reddy Chittepu, Sudigali Sudheer, Latest Telugu Movies, Telugu World Now,
Tollywood News: హారర్ థ్రిల్లర్ ‘జ’ ట్రైలర్‌ను రిలీజ్‌చేసిన యంగ్‌హీరో సుధీర్‌బాబు
బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో జై దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ ‘జ’. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. కాగా ఈరోజు జ మూవీ ట్రైలర్‌ను యంగ్ హీరో సుధీర్‌బాబు విడుదలచేసి యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే సాగే ఈ ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచింది. ఈ సందర్భంగా నటి హిమజ మాట్లాడుతూ.. ‘‘ఫుల్ లెంగ్త్ ఫెర్‌ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఈ సినిమాను అంగీకరించాను. నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించే మూవీ ఇది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గోవర్ధన్ రెడ్డి గారికి, దర్శకుడు సైదిరెడ్డి గారికి కృతజ్ఞతలు” అన్నారు.
దర్శకుడు సైదిరెడ్డి చిట్టెపు మాట్లాడుతూ.. ‘‘‘జ’ అంటే జన్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మంచి కథా బలం ఉన్న మూవీ. మా ప్రొడ్యూసర్ గోవర్ధన్ రెడ్డి నా మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉపేందర్ సహకారం మరువలేనిది’’ అన్నారు.
తారాగణం: ప్రతాప్‌రాజ్, హిమజ, ప్రీతి నిగమ్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చత్రపతి శేఖర్,
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: సైదిరెడ్డి చిట్టెపు
నిర్మాత: కందుకూరి గోవర్ధన్ రెడ్డి
బ్యానర్: జైదుర్గా ఆర్ట్స్
సినిమాటోగ్రఫి: శివకుమార్ జి
సంగీతం: వెంగి
ఎడిటర్: ఆనంగ్ పవన్
యాక్షన్: `రియల్` సతీష్
కొరియోగ్రఫి : భాను, సన్నీ