Mimicry Artist Yaggadi Srinivas, Teacher, Motivational Speaker, Personality Development Counselling Programe, YS Cultural Creations, Arts and Entertainment, Telugu World Now,
Entertainment & Arts: భావి భారత తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే మిమిక్రి, యాంకరింగ్, పర్సనాలిటీ కౌన్సిలింగ్ ప్రోగ్రాం కళలలో రాణిస్తున్నారు యగ్గడి శ్రీనివాస్.
★ సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం పొట్లపహాడ్ గ్రామానికి చెందిన యగ్గడి శ్రీనివాస్ పలు వేదికల ద్వారా ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకుంటున్నారు. ఈయన ప్రస్తుతం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఓవైపు పిల్లలకు పాఠాలు బోధిస్తూనే.. తీరికవేళల్లో ప్రదర్శనలు ఇస్తూ పలువురి ప్రశంశలు అందుకుంటున్నారు.
★యగ్గడి శ్రీనివాస్ బోధనలో తన మిమిక్రీ కళను జోడించి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఇంతేకాక రిటైర్మెంట్ ప్రోగ్రామ్స్, స్కూల్స్ మరియు కాలేజ్ వార్షికోత్సవం ప్రోగ్రాంలకు యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు పొందారు.
★విద్యార్థులకు పరీక్షలపై వారికున్న భయాందోళను పోగొట్టడానికి, యువతకు కెరీర్ మోటివేషన్&కౌన్సెలింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు.
★గత 30 సంవత్సరాలుగా పలు ప్రదర్శనలు ఇచ్చారు. వివిధ టీవీ ఛానళ్లలో నిర్వహించిన కార్యక్రమాల్లో Gemini వన్స్ మోర్, Zee tv ఛాలెంజ్ షో, etv స్మైల్ రాజా స్మైల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని తన ప్రతిభను కనబరిచారు.