ఈ రోజు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో RPCCS (రాచకొండ పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ) 2025 క్యాలెండర్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ & RPCCS అధ్యక్షుడు శ్రీ సుధీర్ బాబు, IPS గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, RPCCS కు సంబంధించిన ఆర్థిక సంవత్సరం 2024–25 ఆడిట్‌ను త్వరితగతిన ప్రారంభించి, సభ్యులకు Thrift పైన వడ్డీ, షేర్‌లపై డివిడెండ్ త్వరలో అందజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శివ కుమార్ (Addl. DCP, Admin), ట్రెజరర్ బాలరాజ్, డైరెక్టర్లు శ్రీ సంగి వలరాజు, రవీందర్ రెడ్డి, సువర్ణ, మరియు లక్ష్మీ ప్రసన్న గారు మరియు సొసైటీ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.