FILM NEWS : హీరో నితిన్ మోస్ట్ ఎవైటెడ్ హీస్ట్ కామెడీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రంలో ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు. ఈ చిత్రం నుండి అతని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
డేవిడ్ వార్నర్ షార్ట్ హెయిర్ కట్ లో ట్రెండీ దుస్తులు ధరించి పోస్టర్ లో ఫుల్ స్వాగ్ తో ఆకట్టుకున్నారు. అతని చిరునవ్వు, కూల్ ఎక్స్ ప్రెషన్ ఎట్రాక్టివ్ గా వున్నాయి. స్పాట్లైట్ అతని మెరిసే ముఖాన్ని హైలైట్ చేస్తుంది.
రాబిన్ హుడ్ లో వార్నర్ పాత్ర అతిధి పాత్ర అయినప్పటికీ, అతని ప్రపంచ ప్రజాదరణ, మ్యాసీవ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ అతని ప్రజెన్స్ గ్రేట్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంతో అతని అసోషియేషన్ భారీ సంఖ్యలో ప్రేక్షకులను అలరించనుంది.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. కోటి ఎడిటర్‌గా, రాం కుమార్ ఆర్ట్ డైరెక్షన్ నిర్వర్తిస్తున్నారు.
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఎక్సయిట్మెంట్ పెంచుతూ చిత్ర బృందం ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రమోషనల్ టూర్ లో చురుకుగా పాల్గొంటోంది. ఈ రోజు వారు రాజమండ్రిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రేపు కాకినాడకు వెళతారు.
తారాగణం : నితిన్, శ్రీలీల, డేవిడ్ వార్నర్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, కేతిక శర్మ (స్పెషల్ సాంగ్)
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
CEO: చెర్రీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోటి
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, రవివర్మ, విక్రమ్ మోర్
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న