What is Virtual Reality ?, How To Learn Virtual Reality, Special Story On India’s One and Only First and Best Virtual Reality Artist Sudhakanth, Arts & Entertainment, Telugu World Now,
Arts & Entertainment: విర్చ్యువల్ రియాలిటీ అంటే ఏమిటి ? భ్రమా వాస్తవికత: VR Artist సుధాకాంత్.
Virtual Reality అనునది 21వ శతాబ్దంలో ఒక విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానం. శూన్యంలో చిత్రాలను చిత్రించడం, వాటికి వెలుగును నీడను ఇవ్వడం, దాదాపు శిల్పకళా రూపం ఇవ్వడం ఇందులో ప్రత్యేకం, అదీ కూడా సాంకేతిక మాధ్యమాలు అయిన VR HEADSET ద్వారా వీక్షించిన వారికి వాస్తవిక భ్రమా సందిగ్ధ అవస్థ లో వుంచి, మైమరిపైంపచేసే అద్భుతమైన సృజనాత్మక కళా విధానం. 3 Dimansion ను చూపించే విధానం ఆశ్చర్య చకితులను చేస్తుంది.
VR Artist సుధకాంత్ గారి సైకత చిత్రకళ ప్రదర్శనను చూసిన IIIT గచ్చిబౌలి వారు ఆయనను సంప్రదించి తమవద్ద నున్న లాబ్ లో ఈ మాధ్యమ మీద ప్రయోగాలు చెయ్యమని కోరడం జరిగింది. ప్రయోగ శీలి అయిన సుధకాంత్ వెంటనే వారి ఆహ్వానాన్ని అదృష్టంగా తలచి, దాదాపు 4 నెలల పాటు నిరంతర శ్రమతో సాధన చేశారు. ఆ ఆయన పట్టుదల వృథా కాలేదు, IIIT వారు సుధాకాంత్ గారిని భారత దేశ మొట్టమొదటి Virtual Reality Artist గ ప్రకటించారు. ఆయన ఇందులో ప్రయోగాత్మక శైలి లో ఎన్నో వీడియో లు చేశారు, వాటిని YouTube లో వుంచి ఎంతో మంది వీక్షకుల ప్రశంసలను పొందారు.
ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా సుధాకాంత్ తనకున్న సృజనాత్మకతను ఒక మాధ్యమానికి పరిమితం చేయకుండా, వినూత్నంగా విశేషంగా ఉన్న మాధ్యమాల్లో ప్రయోగాలు చేస్తూ, వాటిలో సాధన చేసి, తన ఆత్మ సంతృప్తి పరుచుకొంటూ, అదే సంతృప్తిని ఇతరులకూ పంచడానికి ఇష్ట పడతారు. అదే పంథాలో 2019 నుండి IIIT, గచ్చిబౌలి, హైదరాబాద్, వారి తోడ్పాటుతో, వారి లాబ్ నందు VIRTUAL REALITY లో ప్రయోగాలు చేసి, సాధన చేసి, అప్పటికే తనకున్న కళా నైపుణ్యం జత చేర్చి అద్భుతాలు సృష్టించారు. అందులో మచ్చుకు కొన్ని యూట్యూబ్ ఛానెల్ లింక్ లను ఇక్కడ చేర్చడం జరిగింది.Virtual Reality అనేది 50% సాంకేతికత, 50% మానవ నైపుణ్యం. ఇందులో ఎన్నో బ్రాండ్స్ Head Sets వున్నాయి, అందులో ప్రముఖ తైవాన్ కంపెనీ అయిన HTC Vive అనునది చాలా సౌకర్యంగా, మంచి సామర్థ్యం కలిగి వుండడం దీని ప్రత్యేకత. పైన చెప్పినట్లుగా సృజనాత్మకతను వ్యక్తపరచడానికి ఇదొక క్రొత్త మాధ్యమం. భ్రమ, వాస్తవిక భ్రమ వాదము, ఈ Headset ను ధరించిన మీదట మనకు అందులో ఒక అనంతమైన శూన్య స్థలం కనిపిస్తుంది. అందులో ప్రతీది 360 డిగ్రీ అంటే చాలా సహజ వాతావరణ సదృశ్యంగా చూడవచ్చు. అలాగే ఇందులో కనిపించే ప్రతీ పదర్తమూ భ్రమనే. కానీ వెలుగు నీడల సమీలనంలో అత్యంత సహజ పదార్థంగా అగుపించడం ఈ మాధ్యమం ప్రత్యేకత.
Virtual Reality సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న ప్రముఖ వ్యాపార సంస్థలు htc vive, Oculus, Samsung, Pimax, ఇంకా కొన్ని, ఇందులో కళాకారులు తమ సృజనా శక్తిని ప్రదర్శించడానికి Google సంస్థ అభివృధి పరిచిన Tiltbrush అనే Software దీనికి సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా కళా కారులు చాలా స్వతంత్రంగా స్వేచ్చగా తమ సృజన సీలతను ప్రదర్శించవచ్చు.
ఈ మొత్తం ప్రక్రియ డిజిటల్ గా జరుగుతూ వుంటుంది. ఈ మాధ్యమం మాయ అనే 3D max అనే Modeling Software పని విధానానికి అత్యంత దగ్గరగా ఉంటుంది, కానీ ఇది అసలు సిసలు కళాకారులకు ఎంతో ఉపయోగ కరమైనది, ఇందులో డిజిటల్ గేమ్స్ ఆడుకోవడం ఒక గొప్ప అనుభూతి. ఇందులోనే YouTube లో 360 dergree అను ఒక సాంకేతికత ద్వారా మనం అక్కడే, ఉండి అన్ని వైపులా చూడగలగడం ఒక గొప్పనుభూటినిస్తుంది, Immersed Videos చూడడం ద్వారా గొప్ప అనుభూతిని పొందవచ్చు.
Virtual Reality గురించి అవగాహన కొరకు ఇక్కడ సుదాకాంత్ గారి వీడియో Links వుంచడం జరిగింది…వీక్షించండి.