Brahmam Gari Matam, Peetadhipati, World Vishwa Brahmanana Sangam, Minister Vellampally Srinivasa Rao, Brahmam Gari Charitra, Telugu World Now,
BHAKTHI NEWS: “బ్రహ్మం గారి పీఠం” గౌరవం కాపాడటం మన అందరి బాధ్యత: ఆంధ్ర ప్రదేశ్ దేవదాయ ధర్మదాయ శాఖ.
దేవాదయ శాఖ రూల్సు, సాంప్రదాయాల ప్రకారమే ముందుకు వెళతాం.. మఠానికి వారసులు ఎవరు అనే విషయమై ఇంకా నిర్ణయానికి రాలేదు.. పీఠాధిపతి నియామకంపై కమిటీ నియమించి వివాదాన్ని పరిష్కరిస్తాం: దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు…
కడప జిల్లా బ్రహ్మం గారి పీఠం గౌరవము కాపాడటం మన బాధ్యత అని, దేవాదయ శాఖ రూల్సు, సాంప్రదాయాల ప్రకారమే ముందుకు వెళతాం అని, కడప జిల్లా బ్రహ్మం గారి మఠం పై ఎవరూ వివాదాస్పదం చేయవద్దని, ఎవరికీ అన్యాయం జరగకుండ చర్యలు తీసుకుంటాం అని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు… ఆదివారం బ్రహ్మణవీధి దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయం నందు దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ పి. అర్జున రావు, జాయింట్ కమిషనర్ ఆజాద్, రిజనల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంభ, డిప్యూటి కమిషనర్ రాణా ప్రతాప్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బ్రహ్మం గారి పీఠం విషయంలో ఎవరూ విద్వేషాలు రెచ్చగొట్టకుండా అందరూ సమన్వయం పాటించాలని సూచించారు. దేవాదయ శాఖ రూల్సు, సాంప్రదాయాల ప్రకారం కొద్ది రోజుల్లోనే సమస్యను పరుష్కరిస్తాం అన్నారు. పీఠం గౌరవం మర్యాదలను పెంపొందించేలా అందరూ సహకరించాలన్నారు. మఠం పవిత్రత ను కాపాడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు అదేశించిన్నట్లు వివరించారు. మఠంపై మఠాధిపతులు సూచనలను ఉన్నతాధికారులకు అందించాలన్నారు.
బ్రంహ్మం గారి మఠం లో వీర బ్రంహ్మం గారు 1693లో జీవ సమాధి అయ్యారు అని, అప్పటి నుంచి వారి వంశం మఠాథిపతులు గా చేస్తూ వస్తున్నారు అని, ఇప్పటి వరకు 11 మంది మఠాధిపతులుగా చేశారన్నారు. ప్రస్తుత మఠాధిపతి స్వర్గస్తులు అయిన అనంతరం తదుపరి వారసులు ఎవరు అనే విషయమై వివాదం నెలకొందన్నారు. తదుపరి వారసుడు ఎవరనే విషయమై మఠాధిపతి ముందుగానే వీలునామా రాశారని చెబుతున్నారు కాని మఠాధిపతి ఇద్దరి భార్యలు వారి వారసులు పీఠాధిపతి స్థానానికి పోటీపడుతున్నారు అన్నారు. దీంతో మఠాధిపతిగా ఎవరు నియమించాలనే విషయమై వివాదం నెలకొందన్నారు. మఠానికి వారసులు ఎవరు అనే విషయమై ఇంకా ఒ నిర్ణయానికి రాలేదన్నారు. దేవాదాయ చట్టం ప్రకారం వీలునామా రాసిన అనంతరం 90 రోజుల్లోపు ధార్మిక పరిషత్ కు పంపాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఏ వీలునామా, ధార్మిక పరుషత్ లేదా దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి అందలేదని సృష్టం చేశారు.. రాష్ట్ట్రంలో 128కి గుర్తింపు ఉన్న మఠాలు, పీఠాలు ఉన్నాయి అన్నారు. మఠంలో మెజార్టీ సభ్యులు ఎవరిని సూచిస్తే వారిని మఠాధిపతులుగా అక్కడ నియమిస్తారు అన్నారు. ఈ నేపధ్యంలో బ్రంహ్మంగారి మఠం నిర్వహణ ను కడప జిల్లా దేవదాయ అసిస్టెట్ కమిషనర్ కు ఇప్పటికే అప్పగించడం జరిగిందన్నారు. అదే విధంగా మఠం పై ఎవరికైనా అభ్యంతరాలు, సలహాలు సూచనలను ఆర్ జేసీ అధికారికి పంపవచ్చు అన్నారు. పీఠాధిపతి నియామకంపై కమిటీ నియమించి, అందరి సూచనలు సలహాలు తీసుకుని వివాదాన్ని పరిష్కరిస్తాం…
పీఠాధిపతి నియామకంపై కమిటీ నియమించి వివాదాన్ని పరిష్కరిస్తాం అని మంత్రి తెలిపారు. కమిటీలో మఠాధిపతులను నియమించి చర్చించి వివాదాన్ని పరిష్కరిస్తాం అన్నారు. కమిటీ సమావేశమై పూర్తి వివరాలు విచారించాక నిర్ణయం తీసుకుంటాం అన్నారు. నిర్ణయం తీసుకునేవరకు కడప దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మఠం వ్యవహారాలు చూస్తారు అని తెలిపారు. సమయం తీసుకుని వివాదాన్ని సామరస్యంగా పరిష్కరిస్తాం అన్నారు. వివాద పరిష్కారానికి హిందూ సంఘాలందరుతో సలహాలు సూచనలు తీసుకుంటాం అని అందుకు ఆర్జేసీ స్థాయి అధికారిని నియమిస్తున్నట్లు వివరించారు, ఆర్జేసీ అధికారికి ఎవరైనా సరే వారి సమస్యలు, సలహాలు, సూచనలు అందించవచ్చు అని వివరించారు. అందరి సూచనలు సలహాలు తీసుకుని ప్రభుత్వం సమస్యను పరిష్కరిస్తుందన్నారు. మఠాధిపతిపై నిర్ణయం తీసుకునేవరకు దయచేసి అంందరూ సంయమనం పాటించాలని కోరారు…