Sarah Kirlew, Australian Consul General for Southern India, MLC Kavitha, Telangana News,
TELANGANA NEWS: పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ప్రత్యేక ఆహ్వానం మేరకు, ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సారా కిర్లూతో ఎమ్మెల్సీ కవిత జూమ్ కాన్ఫరెన్స్
పారిశ్రామిక రంగంలో అగ్ర స్ధానంలో తెలంగాణ: ఎమ్మెల్సీ కవిత
దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ర్టం దేశంలోనే నంబర్‌వన్: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో ప్రపంచస్థాయి పారిశ్రామిక పాలసీ: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సారా కిర్లూ ప్రత్యేక ఆహ్వానం మేరకు, ఈ రోజు జరిగిన జూమ్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణలో పారిశ్రామిక రంగ ప్రగతికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ స్థాయి పారిశ్రామిక పాలసీని అమలు చేస్తోందన్న ఎమ్మెల్సీ కవిత, కరోనా సమయంలోనూ 1700 కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి కనబరిచాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలోనే పారిశ్రామిక రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిందన్న ఎమ్మెల్సీ కవిత, వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్ గా నిలచి వ్యవసాయ రంగంలోనూ నెంబర్ వన్ గా ఉందన్నారు.
గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో పర్యటించిన విషయాలను గుర్తుచేసిన ఎమ్మెల్సీ కవిత, అక్కడి విధానాలు, స్థానిక పద్దతులను అభినందించారు. అయితే ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య ప్రజా సంబంధాలు, వాణిజ్య, వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపడాలని అభిప్రాయపడ్డ ఎమ్మెల్సీ కవిత, చర్చల ద్వారా అనేక అంశాల్లో ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమవుతుందని తెలిపారు. తెలంగాణ అనేక పర్యాటక ప్రాంతాలకు నెలవన్న ఎమ్మెల్సీ కవిత, హైదరాబాద్ లో పర్యటించాల్సిందిగా సారా కిర్లూను ఆహ్వానించారు.