పవన్ కళ్యాణ్ ని సూటిగా నిలదీసిన మంత్రి పేర్ని నాాని.
అద్దె మైక్‌కు, పవన్‌కు తేడా లేకుండా పోయింది: మంత్రి పేర్ని నాాని.
అద్దె మైక్‌లా తయారయ్యాడు:
‘భారతదేశంలో లేదా ప్రపంచ వ్యాప్తంగా నలుమూలలా, తెలుగు ఛానల్స్ ఎన్ని చోట్ల వస్తే అన్ని చోట్ల కూడా పవన్ నాయుడు.. టీడీపీ, బీజేపీ ప్రాయోజిత కార్యక్రమంలో అందరికీ చక్కగా వినోదం అందించారు. కాల్ షీట్లకు న్యాయం చేశాడు. తప్పు లేదు. అయితే
పవన్ నాయుడు చివరికి అద్దె మైకులా తయారయ్యాడు, అద్దె మైకుకు, పవన్ నాయుడుకు తేడా లేకుండా పోయింది. షామియానా కంపెనీలో డబ్బులు కట్టి మైకు అద్దెకు తెచ్చుకుంటాం. ఆ మైకులో ఏ పార్టీ నాయకుడు మాట్లాడితే ఆ మాటే బయటికి వస్తుంది. ఏపీకి అద్దె మైకు లాగా.. పవన్ నాయుడు ఒక అద్దె మైకు నాయుడు అయ్యారు’.
రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకున్నా.:
‘శ్రీ జగన్ గారి చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్యకేసులో ముద్దాయిలను పట్టుకోలేదంటావు. వివేకానందరెడ్డి గారి కుమార్తె సీబీఐ దర్యాప్తు కావాలని పట్టు బట్టిన మీదట సీబీఐకి దర్యాప్తు అప్పగించడం జరిగింది. వివేకా హత్య తర్వాత 2 నెలల 15 రోజులు చంద్రబాబే సీఎంగా ఉన్నారు. ఆధారాలు తుడిచివేయడం అంటూ జరిగితే అది చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఈ కేసులో చంద్రబాబు పాత్ర మీద విచారణ కూడా అడగడం లేదంటే పవన్‌కళ్యాణ్ ఇప్పటికీ దత్తపుత్రుడిగా ప్యాకేజీ అందుకుని వారి స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నట్లే కదా?’.
‘ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరుగుతోందని తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి మాట్లాడాడంటే పవన్‌కళ్యాణ్‌కు బుర్ర, బుద్ధి లేవని అర్థమవుతోంది. ఎందుకంటే సీబీఐ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కేసుకి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంబంధమూ లేదు. అయినా మోదీ, అమిత్‌షా మీద మీకేమైనా దొబ్బు తెగులు ఉందా?. కేసు చూసేది సీబీఐ, మోదీ, అమిత్‌షా అయితే అది శ్రీ జగన్ గారికి ఆపాదించడం ఏంటి?. ఎంత కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు. ఎవడో రాసిస్తే, ఏది మాట్లాడమంటే అది మాట్లాడడం. ఇది ఎంత అన్యాయం?’.
అప్పుడు మీ ప్రభుత్వమేగా?.:
‘బీజేపీ నుంచి ఇంకొకడు వచ్చాడు, పంచాయితీ ప్రెసిడెంట్‌గా కూడా చేయలేదు, సుజనా చౌదరితో తిరిగి తిరిగి చెంచాగిరి చేసే సునిల్ దియోదర్ కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు, మరి వారిని కదా మీరు తిట్టాల్సింది. వివేకా మర్దర్ గురించి మీరు ఎందుకు ఏం చేయట్లేదు అని అడగాల్సింది కదా?. వివేకా గారు 2019 మార్చిలో హత్యకు గురైతే శ్రీ జగన్ గారు మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, అప్పటికే మీ పార్ట్‌నర్, సహవాసి చంద్రబాబు ప్రభుత్వం ఉంది కదా. మీ ప్రభుత్వంలోనే కదా ఇదంతా జరిగింది?. మీరు మోసిన చంద్రబాబు హయాంలోనే కదా అది జరిగింది?’.
ఆ ఆలస్యానికి బాధ్యులెవరు?:
‘నిన్న పవన్‌కళ్యాణ్ మాటల్లో జగన్ గారి మీద జరిగిన హత్యాయత్నాన్ని ప్రస్తావించాడు. అది జరిగింది 2018 అక్టోబరులో. ఆ తర్వాత 2018 అక్టోబరు నుంచి 8 నెలల పాటు, టీడీపీనే అధికారంలో ఉంది. ఆ తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించడం జరిగింది. ఎన్‌ఐఏ ఎవరి పరిధిలో ఉంటుంది?. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ల దర్యాప్తులో డిలే జరిగితే దానికి ఎవరు బాధ్యులు?’.
అజ్ఞానవాసి!:
‘ఈ రెండు కేసుల విచారణ కేంద్రం పరిధిలో ఉందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడడం కనీసం స్థాయి నాయకుడు కూడా చేయడు. సినిమాల్లో మాట్లాడు తప్పులేదు, ఆహా, ఓహొ అంటూ మేం సినిమా బావుంటే వచ్చి ఈల వేస్తాం. కానీ ఏంటి ఈ దుర్మార్గం?. ఇంత అన్యాయంగా, అక్రమంగా మాట్లాడడం ఏంటి?, ఇదేనా విజ్ఞత?. తమరు అజ్ఞాతవాసి అనుకున్నాం కానీ అజ్ఞానవాసి అని అర్ధమవుతుంది, నువ్వు తిట్లాల్సింది ఎవరిని కేంద్రాన్ని కదా?’.
ఆ లడ్లు బాగు చేసుకుని తింటున్నావా?
‘పవన్‌కళ్యాణ్ తిరుపతి ఓటర్ల దగ్గరికి ఏ వైయస్సార్‌సీపీ నాయకుడు వచ్చినా నిలదీయండి అంటాడు. తిరుపతి వారు మాత్రం నిలదీయాల్సింది ఇతన్ని కదా అంటున్నారు. 2014లొ పెద్ద పెద్ద రంకెలు వేసుకుంటూ కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అన్నావ్, మోదీని తీసుకురమ్మన్నావ్, మోదీ దేశాన్ని ఉద్దరిస్తాడన్నావ్, కమలం గుర్తుకు ఓటు వేయమన్నావ్, 10 రోజుల తర్వాత చంద్రబాబు నువ్వూ కలిసి మీ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుని బయటికి వచ్చి ఇద్దరూ షేక్ హ్యండ్ ఇచ్చుకుని సైకిల్‌కు ఓటేయమని అడిగావ్, 2019 ఎన్నికలు వచ్చేసరికి బీజేపి పాచిపోయిన లడ్లు ఇచ్చారన్నావ్, దక్షిణాది వారంటే మోదీకి, బీజేపీకి చులకన, మనకు ద్రోహం చేస్తారన్నావ్, పెద్ద పెద్ద రంకెలు వేశావ్, పాచిపోయిన లడ్లు ఆబగా ఆవురావురుమని తినేస్తున్నావ్, పాచిపోయిన లడ్లు బాగుచేసుకుని తింటున్నావా?
వామ పక్షాలతో జత కట్టావు:
‘మళ్ళీ నాకు ఎర్రజెండా ఇష్టం, నేను చిన్నప్పుడు కంకి, కొడవలి, కత్తి, సుత్తి, ఎర్రజెండా పట్టుకున్నానన్నావ్, నాకు కమ్యునిస్ట్ భావజాలం ఉందన్నావ్, అన్నప్రాసన రోజు పట్టుకున్న కత్తి, సుత్తి ఏమయ్యాయ్, వారికి ఓటేయమన్నావ్, తర్వాత మాయావతి కాళ్ళకు నమస్కారం పెట్టి కాబోయే ప్రధాని అన్నావ్, ఆమె ఏమయ్యారు, ఇప్పుడు మోదీకి, కమలం పువ్వుకు ఓటేయమని అడుగుతున్నావ్. ఏరా బాబు 2014లో కమలం, సైకిల్, 2019లో కత్తి, సుత్తి, కంకి, కొడవలి, ఏనుగు, గ్లాస్‌కు ఓటేయన్నావ్, ఇప్పుడు కమలం అంటున్నావ్, ఎవరు ఎవరికి ఓటేయాలి, నిన్ను కాదా నిలదీయాల్సింది అని తిరుపతి ప్రజలు అనుకుంటున్నారు’.
శాస్తి తప్పదు:
‘2019 ఎన్నికల్లో పచ్చిగా నిర్లజ్జగా పవన్ నాయుడు.. నీ నోటితో ఏం మాట్లాడావు. జగన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని, ఇది శాసనం అని తమరు పాచిపోయిన నోటితో అనలేదా?. మరి వెంకన్న స్వామి జగన్‌ను సీఎం చేయలేదా. నిన్ను రెండు చోట్ల ఎందుకు గుండు కొట్టించారు?. వెంకన్న సామి ఎవరికి శిక్ష వేశారు. తప్పుడు మాటలతో దేవుణ్ని కూడా రాజకీయాల్లోకి లాగితే.. ఇదే విధంగా శాస్తి చేస్తాడు’.
‘బెజవాడ నడిరోడ్డులో ఆలయాలను, విగ్రహాలను ప్రొక్లేన్లతో చంద్రబాబు కూలగొడితే ఒక్కమాట మాట్లాడని పవన్‌నాయుడు, ఇప్పుడు జగన్ గారిపై అసత్యాలు మాట్లాడతావా?. ఎన్ని అసత్యాలు మాట్లాడితే అంత శాస్తి జరుగుతుంది పవన్‌నాయుడు’.
బరి తెగించి మాట్లాడుతావా ?
‘సినిమా షూటింగ్ అయింది, ఒకటే మీటింగ్, రెండు కాల్‌షీట్స్, టీడీపీకి, బీజేపికి, సరాసరి ప్రత్యేక విమానంలో వచ్చావ్, తిట్టావ్, వెళ్ళిపోయావ్, తిరుపతి వచ్చి మరి వెంకన్న స్వామి గుర్తుకు రాలేదా?. పైకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవా?. దేవుడు గుర్తుకు రాడు. కానీ కొండ మీద బ్యాగులు అమ్ముకునే వాళ్ళు, ట్యాక్సీ తోలే వారిని బెదిరిస్తున్నారని ఆరోపించావు. నీవు ఏ ట్యాక్సీ వారితో మాట్లాడావు?. విమానం దిగిన తర్వాత ఎవరితో మాట్లాడావు?. కొండ మీద ఏ షాప్ వారితో అయినా మాట్లాడావా?. మరీ ఇంత బరితెగించి మాట్లాడతావా?’.
ఎర్ర చందనం:
‘రేషన్ డోర్ డెలివరీ జరుగుతుందో లేదో కానీ ఎర్ర చందనం చైనాలో డోర్ డెలివరీ జరుగుతుందన్నావ్, ఇందులో ఎవరి ఎవరికి వాటా ఉండాలి, వాటా ఉంటే పేర్ని నానికి, అమిత్‌షాకు, రాజ్‌నా«ద్‌సింగ్, మోదీ గారికి వాటా ఉండాలి. మరి సునీల్ దియోదర్‌కి అయినా చెప్పాలి కదా?. తప్పు ఇలా చేయకూడదని’.
దిగజారుడు మాటలు:
‘రత్నప్రభ గారి వల్లే ఏపీకి సాఫ్ట్‌వేర్ కంపెనీలు వచ్చాయంటున్నావ్, మరి ఆమె ఎవరి హయాంలో పని చేశారు, అప్పటి సీఎం ఎవరు, రాజశేఖర్‌రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో ఆమె ఐటీ కార్యదర్శిగా పనిచేశారు. ఎందుకింత దిగజారి మాటలు మాట్లాడుతున్నావ్, మాట్లాడే ముందు అసలు ఏం మాట్లాడుతున్నాను, ప్రజలు మన గురించి ఏం అనుకుంటారు అనే ఆలోచన కూడా ఉండదా?’.
చిరంజీవి తమ్ముడిగానే..:
‘పవన్‌నాయుడు గారు మిమ్మల్ని చిరంజీవి తమ్ముడిగానే గుర్తించారు, నటుడంటే చిరంజీవి గారు కాబట్టి ఆ ఇంట్లో ఎవరున్నా నటించినా నటించకపోయినా వారిని ఆదరిస్తారు. మీరు తెరమీద నటించలేకపోయినా రాజకీయాల్లో మాత్రం గొప్ప నటుడిగా నటిస్తున్నారు. ఆయన ఎవరినైనా చొక్కా పట్టుకుంటానంటున్నారు, బీజేపీ వారిని ఎందుకు నిలదీయడం లేదు, ప్రత్యేకహోదా లేక నిద్ర పట్టలేదు అన్నం మానేశానన్నారు, మరి ఇప్పుడు బిర్యానీ తింటున్నారా?’.
నేనూ బలిజ కులస్తుడనే:
‘పవన్‌నాయుడు విశాఖ ఉక్కు గురించి నీ నోరు ఎందుకు పెగలడం లేదు, సిగ్గూ, శరం లేకుండా బరితెగించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎప్పటికీ ఏపీ రాజకీయాల్లో గెలవలేవు, ఆ పరిస్ధితి ఉండదు. అంతర్వేది దేవాలయంలో కొందరు కుట్రతో రధం తగలబెడితే సీబీఐ ఎంక్వైరీ ఎందుకు చేయడం లేదు, దీని వెనుక బీజేపీ వారున్నారు కాబట్టే ఆ కేసును టేకప్ చేయడం లేదనే అనుమానం కలుగుతుంది, ఆలోచించి ఓటు వేయడానికి తిరుపతి ప్రజలు మన బలిజలు సిద్దంగా ఉన్నారు, బలిజలకు సాయం చేస్తే ఎప్పటికీ మర్చిపోరు కాబట్టి వారంతా వారికి సాయం చేసిన శ్రీ జగన్ గారికి ఓటు వేస్తారు. నీకు లాగా నేను బలిజ కులస్తుడినే’.
అందుకే చెబుతున్నా..:
‘ఒక బలిజ వాడిగా చెప్తున్నా. ఏపీకి అన్యాయం చేస్తున్న వారిని మీరు చొక్కా పట్టుకుని నిలదీయండి, పోలవరం ప్రాజెక్ట్‌కు త్వరాగా డబ్బులు ఇవ్వండని నిలదీయం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కేంద్రంలోని పెద్దల చొక్కా పట్టుకొండి, ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వండని చొక్కా పట్టుకోండి. అంతే తప్ప, మీరు అద్దె మైకులా తయారై మన బలిజల పరువు తీయద్దని సూచిస్తున్నా’.