50 దేశాల్లో ఉన్న ఎన్నారై టీఆర్ఎస్ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు తమవంతుగా కృషి చేయాలని ఎన్నారైలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు
కార్యకర్తలే టీఆర్ఎస్ బలమని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేయాలని ఎన్నారైలను ఎమ్మెల్సీ కవిత కోరారు.
టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఇటీవల విదేశాల్లో వివిధ కారణాల వల్ల మరణించిన ఎన్నారై టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సురభి వాణి దేవి గెలుపు ఖాయమన్నారు ఎమ్మెల్సీ కవిత. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గారు ఎన్నో ఏండ్లుగా పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్సీ కవిత, మాజీ ప్రధాని పివి నరసింహారావు కూతురు వాణిదేవి గారు గత 30 ఏండ్లుగా విద్యారంగంలో సేవలందిస్తున్నారన్నారు. వీరిద్దరి గెలుపునకు ఎన్నారైలు సైతం తమ వంతు పాత్ర పోషించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారని, అదే విధంగా సోషల్ మీడియాలో సైతం టీఆర్ఎస్ కార్యకర్తలంతా, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలకు సరైన డేటాతో సమాధానం చెప్పాలన్నారు. ఎన్నారైలంతా తమ బాధ్యతగా, టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేయాల్సిందిగా తెలిసిన వారిని కోరాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
కార్యక్రమాన్ని నిర్వహించినందుకు టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారిని అభినందించిన ఎమ్మెల్సీ కవిత, రెండు సంవత్సరాలు పూర్తి చేసినందుకు సౌత్ ఆఫ్రికా శాఖ మరియు మిగితా దేశాలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక, ఏప్రిల్ 27న జరిగే ఆవిర్బావ సమావేశానికి, అవకాశం ఉన్న ఎన్నారైలంతా హాజరు కావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ న్యూజెర్సీలో టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ ప్రతినిధి – శ్రీ దేవేందర్ రెడ్డి నల్లమడ, టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా- జాయింట్ సెక్రటరీ – శ్రీ రమణ రెడ్డి కంకనల,
,టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా VIce ప్రెసిడెంట్- సత్యం గురిజపల్లియం తెరాస కుటుంబ సభ్యులకి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ కవిత గారి సూచనల మేరకు అన్ని దేశాల ప్రతినిధులను ఏప్రిల్ 27 నాడు పాల్గొనే విదంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు ఎన్నారై టీఆర్ఎస్ కార్యకర్తలంతా మహేష్ బిగాల విజ్ఞప్తి చేసారు .
ఈ కార్యక్రములో ప్రపంచ వ్యాప్తంగా వున్నా తెరాస ప్రతినిధులు అనిల్ కూర్మాచలం , కాసర్ల నాగేందర్, విజయ్ కోసిన, జగన్ వాడ్నలా ,శామ్ బాబు ఆకుల , జువ్వాడి శ్రీనివాస్ ,అశోక్ దుసారి , నాగరాజు గుర్రాల,మహిపాల్ రెడ్డి, సతీష్ రాధారపు,కోమాండ్ల కృష్ణ , శ్రీధర్ అబ్బగోయినా , టోనీ జన్ను ,అరవింద్ గుంత శ్రీధర్, చిట్టి బాబు , ,వెంగల్ జలగం , రాజేష్ మాదిరెడ్డి ,నవీన్ , అభిలాష , సుధీర్ జలగం ,అహ్మద్ షేక్ ,నరేందర్ రెడ్డి మరియు మిగితా తెరాస ప్రతినిధులు పాల్గొన్నారు.