ఏపీలో అనకాపల్లి ఎంపీ సీటు అన్ని పార్టీలకు కీలకంగా మారింది.. ప్రతీ పార్టీ నుంచి కనీసం ముగ్గురు సీనియర్ లీడర్లు ఆ సీటు కావాలని పోటీ పడుతున్నారు..అయితే పార్లమెంటు సీటు అంటేనే పారిశ్రామిక వేత్తల్ని రంగంలోకి దింపుతుంటాయి పార్టీలు. తద్వారా ఆ పార్లమెంటు సీటు పరిధిలోని ఎమ్మెల్యే సీట్ల గెలుపు బాధ్యత ఆ ఎంపీ అభ్యర్థి చూసుకుంటారనేది మొదటి నుంచి పార్టీలు అనుసరిస్తున్న విధానం.
ఈ నేపథ్యంలో అనకాపల్లిలోని ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇప్పుడు అక్కడ కీలకంగా మారారు.. తాను ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ పంట పండినట్లే అని స్థానిక రాజకీయ పండితుల విశ్లేషణ.. ఆయన ఎవరో కాదు.. ఎంవీఆర్.. ముత్యాల వెంకటేశ్వర రావు..టెక్స్ టైల్స్ రంగంలో దిగ్గజంలాంటి ఈ పారిశ్రామిక వేత్త గత పదేళ్లుగా నియోజకవర్గంలో హాట్ టాపిక్.. ఏ పార్టీలోనూ చేరకుండా అందరికీ సమదూరం పాటిస్తారు..అందరితోనూ సన్నిహితంగా ఉంటారు.
ఈయనను తమ పార్టీలోకి తీసుకోవాలని అన్ని పార్టీలూ ప్రయత్నిస్తాయి..మొదటిది ఆయన ఆర్థికంగా బలంగా ఉండటం.. రెండోది ఆయన చేసే సేవా కార్యక్రమాలు.. ఎంవీఆర్ యువసేన పేరుతో ఏకంగా ఒక సేవా సామ్రాజ్యాన్నే నిర్వహిస్తున్నారు.. అనకాపల్లి జిల్లాలో ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా కచ్చితంగా ఎంవీఆర్ అక్కడ ఉంటాడు.. కొత్త ఆలయాలు కట్టించడం..ఉత్సవాలకు దన్నుగా నిలవడం.. పాడుపడిన ఆలయాల్ని పునర్నిర్మించడం.. రూపాయికే పేదవాడికి భోజనం అందించడం, అనకాపల్లి జిల్లా మొత్తం ఊరూరా మెడికల్ క్యాంపులు నిర్వహించడంలాంటి ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు ఎంవీఆర్ యువసేన ద్వారా విస్తృతంగా చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో నిరుద్యోగ యువత అంటూ ఉండకూడదని తన వంతుగా 5 వేల మందికి ఉద్యోగాలు కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. వారికి శిక్షణ ఇప్పించి మరీ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే రాజకీయాల విషయంలో మాత్రం ఆయన మనసులో ఏముందనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. వైసీపీ కీలక నేతలు ఆయనకు టచ్ లో ఉంటారు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సన్నిహితంగా ఉంటారు.. కానీ ఆయన ఏ పార్టీలోనూ చేరడం లేదు. అయితే సేవా కార్యక్రమాల ద్వారా సొంతంగానే తన బలాన్ని బలగాన్ని పెంచుకోవాలనేది ఆయన ఆలోచనగా చెబుతారు. ఆయన లక్ష్యం పార్లమెంటు సీటు మాత్రమే అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
ఏ పార్టీ సీటు ఇస్తే ఆ పార్టీ లో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. ఈ మధ్య తెలుగు దేశం పార్టీ అధినేత సైతం ఎంవీఆర్ గురించి సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఆయనకు అత్యంత ప్రజాదరణ ఉన్నట్లు ఆ సర్వేలో తేలిందట.. మరి టీడీపీలో చేరతారా ..? అయితే ఆ సీటు జనసేన అడుగున్నట్లు వినికిడి. స్వయంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఆ సీటు నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట.. మరి ఈ నేపథ్యంలో ముత్యాల వెంకటేశ్వర రావు ఏ పార్టీనుంచి బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.