Weekly Horoscope From June 13th to 19th by Dr. Sarada Devi. Ph.D, Astrology Consultant, Daily Horoscope, Zodiac Signs, Raashi Phalalu, Telugu World Now.
Horoscope: ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా జూన్ 13th నుండి జూన్ 19th వరకు వారఫలాలు.
మేష రాశి :
ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యసమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతనంగా చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. విద్యార్థులు ఉన్నత ఫలితాలు పొందుతారు. వీరి యొక్క సంతానికి ఆర్థికపరమైన అభివృద్ధి కలుగుతుంది. నూతన ఉద్యోగం ప్రయత్నిస్తున్నవారు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వైవాహికజీవితంలో స్వల్ప సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. రైతులకి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం కాలభైరవ అష్టకం చదవటం శ్రేయస్కరం.
వృషభ రాశి :
ఈ రాశి వారికి వృత్తిలో గుర్తింపు. పనులు వాయిదా వేస్తారు. నూతన పెట్టుబడులు పెట్టాలి అని అనుకునే వారు, కొంత కాలం ఆగటం మంచిది. ఈ రాశి స్త్రీలకి శుభ సమయం. ఈ రాశి వారు తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వుండాలి. వ్యాపారస్తులకు, విద్యార్థులకి సానుకూల ఫలితాలు. వీరు దుర్గ సప్తశతి పారాయణము చెయ్యటం ఉత్తమం.
మిథున రాశి :
ఈ రాశి వారికి దూర ప్రయాణ సూచన. స్నేహితులతో కలసి సమయం గడుపుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యారంగం మరియు ఆర్థిక పరమైన రంగంలో వున్న వారికి ఉత్తమ ఫలితాలు. విద్యార్థులు అధిక శ్రమ చెయ్యాల్సి ఉంటుంది. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం మహా లక్ష్మి అమ్మ వారిని ఆరాధించటం ఉత్తమం.
కర్కాటక రాశి:
ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా సాధారణ ఫలితాలు. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. నూతన గృహోపకరణాల కొనుగోలు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృత్తిలో ఇంక్రిమెంట్లు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. ఉన్నతవిద్య విద్యా కోసం ప్రయతిస్తున్నవారు అధిక శ్రమ చెయ్యవలసి వస్తుంది. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం భ్రమారాంబిక అష్టకం చదవటం శ్రేయస్కరం.
సింహ రాశి :
ఈ రాశి వారికి ఆదాయం బాగుంటుంది. డిజిటల్ మార్కెటింగ్ లో వున్నవారికి అధిక ఫలితాలు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి సానుకూల సమయం. విద్యార్థులు నూతన కోర్సుల విషయంలో ఆసక్తి చూపిస్తారు. కళాకారులకి కలసి వస్తుంది. వీరు ఉన్నత ఫలితాల కోసం శ్రీరామ అష్టకం చదవటం శ్రేయస్కరం.
కన్య రాశి :
ఈ రాశి వారికి వృత్తి రీత్యా బాగుంటుంది. విద్యార్థులు అధిక శ్రమ చెయ్యవలసి వస్తుంది. విదేశాలకి వెళ్ళాలని అనుకునే వాళ్ళకి కొంత సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం కలదు. అధిక వ్యయ సూచన. వీరు కనకధారా స్తోత్రం చదవటం శ్రేయస్కరం.
తులా రాశి :
ఈ రాశి వారికి ఉన్నత విద్యా పరంగా కలసి వస్తుంది. చాలా కాలం నుంచి పరిష్కారం కాని సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువుల విషయంలో కొంత ఆందోళనకి గురి అవుతారు. ఆర్థికాభివృద్ధికి బాగుంటుంది. వీరు దుర్గా అష్టకం చదవటం శ్రేయస్కరం.
వృశ్చిక రాశి :
ఈ రాశి వారికి వృత్తిపరంగా గుర్తింపు. పిల్లల చదువుల కోసం ఋణాలు తీసుకొనే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. సంతానం ఉద్యోగంలో స్థిర పడతారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం సుబ్రమణ్యస్వామికి అభిషేకం చెయ్యటం ఉత్తమం.
ధనస్సు రాశి :
పోటీ పరీక్షలో పాల్గొనే ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. డైరీ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో వారికి సానుకూల ఫలితాలు. వ్యాపారంలో రాణిస్తారు. ఆధ్యాత్మిక పరమైన విషయాలలో ఆసక్తి చూపిస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా వుంటుంది. పెట్టుబడుల పరంగా కొంత ఇబ్బందులు ఎదురు కొంటారు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శివాలయాన్ని సందర్శించడం శ్రేయస్కరం.
మకర రాశి :
ఈ రాశి వారికి ఆదాయం బాగుంటుంది. దూర ప్రయాణాలు, రైతులకి లాభాలు సూచన. క్రీడాకారులకి అనుకూల సమయం. ఇంటర్వ్యూస్ లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక మరియు థార్మిక విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. వీరు ఉత్తమ ఫలితాలు పొందటం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం శ్రేయస్కరం.
కుంభ రాశి :
ఈ రాశి వారికి వ్యాపారంలో కొంత వొత్తిడి ఎదురుకొన వలసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి . వస్త్ర మరియు ఆటోమొబైల్ రంగం లో వారికి కలసి వస్తుంది. వీరి సోదరులకు ఆనారోగ్య సూచన. విద్యార్థులకి సానుకూల ఫలితాలు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వీరు హనుమాన్ ని ఆరాధించటం శ్రేయస్కరం.
మీన రాశి :
ఈ రాశి వారికి వృత్తి, ఆదాయపరంగా కలసి వస్తుంది. నూతన కార్యక్రమాలు కొంత ఆలస్యంగా మొదలుపెడతారు. సున్నితమైన మాటతీరుతో వ్యవహరించవలసి వస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అడ్మినిస్ట్రేషన్ మరియు అకౌంటెంట్ రంగంలో వున్న వారికి అనుకూల సమయం. వీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం శ్రేయస్కరం.