Overseas Manpower Recruitment Agents Association (OMRA) : గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి జీవో జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి ఓవర్సీస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెంట్స్ అసోసియేషన్ (ఓమ్రా) అధ్యక్షులు డిఎస్ రెడ్డి ఒక ప్రకటనలో కృతఙ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా లైసెన్స్ పొంది విదేశీ ఉద్యోగాల భర్తీ వ్యాపారం చేస్తున్న రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల సేవలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని ఆయన కోరారు. తెలంగాణ యువతకు గల్ఫ్ తదితర దేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నిరుద్యోగ నిర్మూలనలో తమవంతు బాధ్యత నిర్వహిస్తున్నామని డిఎస్ రెడ్డి అన్నారు.
గల్ఫ్ మృతులకు రూ.5 లక్షలు చెల్లించడం, గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాల లలో అడ్మిషన్లు, ప్రతి మంగళవారం, శుక్రవారం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ నిర్వహించడం దేశ చరిత్రలోనే ఒక మైలురాయి అని ఓమ్రా అధ్యక్షులు డిఎస్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో 150 రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉన్నాయని, త్వరలో నియమించే గల్ఫ్ సంక్షేమ సలహా కమిటీలో రిక్రూటర్స్ పక్షాన ఇద్దరికి అవకాశం ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇట్లు : డిఎస్ రెడ్డి, అధ్యక్షులు, ఓమ్రా , +91 93933 36699