పోచారంలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల 2024-25 నూతన బ్యాచ్ ఓరియెంటెషన్ కార్యక్రమంలో సీపీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీపీ గారు మాట్లాడుతూ.. విద్యార్దుల భవిష్యత్తును నిర్మించడంలో కళాశాల క్యాంపస్ కీలక పాత్ర పోషిస్తుందని, తమ భవిష్యత్తు నిర్మాణం కోసం కళాశాలను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కళాశాలలు విద్యార్ధుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండేలా చూసుకోవాలని సూచించారు. విధ్యార్థులు ర్యాగింగ్ వంటి హీనమైన చర్యలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, విద్యార్థుల దృష్టి తమ కెరీర్ మీద మాత్రమే ఉండాలని సూచించారు. విద్యార్థులకు ర్యాగింగ్, డ్రగ్స్ వాడకం, ఈవ్ టీజింగ్, ధూమపానం వంటి దురలవాట్ల మీద పోరాటం చేసేలా ప్రేరణ కల్పించారు.
రాచకొండ పోలీసులు, అన్ని విద్యాసంస్థల ఆధ్వర్యంలో చేపడుతున్న ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాల ప్రాముఖ్యతను సీపీ వివరించారు మరియు ర్యాగింగ్ కార్యకలాపాలకు పాల్పడడం విద్యార్థుల భవిష్యత్తును పాడుచేసే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు తమ జూనియర్‌లను స్నేహితులుగా భావించి వారికి అండగా ఉండాలని, వారికి సహకరించాలని సీపీ విద్యార్థులకు సూచించారు.
నిషేధిత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సీపీ సూచించారు. డ్రగ్స్ వాడడం అనేది వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని అనేక విధాలుగా పాడుచేస్తుందని ప్రతి ఒక్కరికి గుర్తు చేశారు. మత్తు పదార్థాల రవాణా మీద ఎన్నొ దాడులు చేస్తున్నామని, ఎంతో మందిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసిపి మల్కాజిగిరి, శ్రీ చక్రపాణి, పోచారం ఐటీసీ పి.యస్ ఇన్స్పెక్టర్ రాజు, కాలేజీ ప్రిన్సిపాల్ శివా రెడ్డి, సిఇఒ, హెచ్‌ఓడిలు, 3000 మంది విద్యార్థులు మరియు వారి తల్లితండ్రులు హాజరయ్యారు.