Benefits of Ghee : భారతీయ సంస్కృతీ, సాంప్రదాయంలో నెయ్యి అనాదిగా ఒక బాగం అయ్యింది. ప్రతి ఇంటిలో తప్పనిసరిగా నెయ్యిని ఉపయోగిస్తారు. పోషకాలు నిండిన నెయ్యి శరీర ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు కలుగుతుంది. శరీరంలోని అన్ని భాగాల పని తీరు సజావుగా సాగేలా చేయటంలో దోహదపడుతుంది. అధ్బుతమైన రుచి, సువానతో అందరిని ఆకట్టుకునే శక్తి దీని మాత్రమే ఉంది.
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి రోగనిరోధక శక్తిని పెంచటంలో, కొవ్వును తగ్గించటంలో సహాయపడుతుంది. ఎముకలు, కీళ్ల బలానికి, రక్తాన్నిశుద్ది చేసి శరీర కణజాలాలు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. దీనిలోని ఆరోగ్యకరమైన కొవ్వు జీర్ణాశయాంతర పేగులోని ఆమ్లాల పిహెచ్ స్ధాయిలను తగ్గిస్తాయి.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం వర్షకాలంలో నెయ్యిని రోజువారిగా కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలను దరిచేరకుండా చూసుకోవచ్చు. అధిక బరువుతో బాధపడుతున్నవారు ఆసమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణ వ్యవస్థకి సంబంధించిన వివిధ వ్యాధుల్ని నివారించటంలో తోడ్పడుతుంది. వర్షాకాలంలో పొట్ట సంబంధింత జీర్ణక్రియ సమస్యలు ఎక్కువగా ఉత్పన్నం అవుతాయి. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కలిపి నెయ్యి తీసుకుంటే జీర్ణ సమస్యలు దరిచేరవు. పేగు గోడల్ని నెయ్యి శుభ్రం చేస్తుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, మలబద్ధకం సమస్యలని తరిమికొడుతుంది.
శరీరం నుంచి టాక్సిన్స్, చెడు కొవ్వుని బయటకి పంపిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం నెయ్యి ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే అమైనో ఆమ్లాలు బరువు తగ్గేందుకు , ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేసేలా దోహదపడతాయి. శరీరమంతా రక్త ప్రసరణ వేగవంతంగా జరిగేలా చేయటంతోపాటుగా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. కాల్షియం లోపం ఉన్న స్త్రీలు రోజూ నెయ్యి తీసుకుంటే ఆ లోపం నుంచి బయట పడొచ్చు.