curd hair mask: వర్షకాలంలో చినుకులు, చల్లని వాతావరణం జుట్టును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వాతావరణంలో తేమ స్థాయులు, హైడ్రోజన్ స్థాయులు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలిపోవడం, జిడ్డుగా మారడం, చుండ్రు వంచి సమస్యలు ఇబ్బంది పడుతుటాయి. వాతావరణ మార్పులే కాకుండా, శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పులు, పోషకాహార లోపం, కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాల వల్ల శిరోజాలు ఎక్కువగా రాలుతుంటాయి. ఈ సిజన్‌లో మీ జుట్టుకు పోషణ అందిచి, హెయిర్ ఫాల్ దూరం చేయడానికి పెరుగు సహాయపడుతుంది. పెరుగులో ఉండే పోషకాలు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేసి వెంట్రుకలకు బలాన్ని, మెరుపునూ ఇస్తాయి. అలాగే ఈ ప్యాక్స్ ఎండ, కాలుష్యాల నుంచి కూడా జుట్టును కాపాడడంలో సహాయపడతాయి.
చుండ్రు ఇబ్బంది ..
ఈ సీజన్‌లో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. పెరుగు, నిమ్మరసంతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మీరు చుండ్రుతో ఇబ్బందిపడుతుంటే.. నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడిలో రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిక్స్‌లో పెరుగు వేసి బాల్స్ లేకుండా పేస్ట్‌లా కలుపుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారి చేస్తే.. చుండ్రు సమస్య దూరం అవుతుంది.
జుట్టు రాలుతోందా..
మీకు హెయిర్ ఫాల్ ఇబ్బంది పెడుతుంటే.. ఎండబెట్టి పొడి చేసిన మందార ఆకులు, పువ్వుల పొడిని కొద్దిగా వేసి.. దీనిలో ఉసిరి పొడి, మెంతుల పొడి కలపాలి. ఇప్పుడు ఇందులో కొద్దికొద్దిగా పెరుగు వేసుకుంటూ మృదువైన పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే.. జుట్టు రాలడం తగ్గుతుంది.