Kalyan Ram : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బింబిసార సినిమా తర్వాత వరుస సినిమాలని లైన్ లో పెట్టారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా, నవీన్ అనే కొత్త దర్శకుడు అభిషేక్ నామా నిర్మాతగా అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో డెవిల్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం డెవిల్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవల కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా డెవిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా బ్రిటిష్ కాలంలో ఉండే సీక్రెట్ ఏజెంట్ కథ అని తెలుస్తుంది. స్వాతంత్య్రం ముందు పీరియాడిక్ కథతో రాబోతున్నారు. దీంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ప్రేక్షకులకు న్యూ అప్డేట్ ఇచ్చారు . డెవిల్ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్రయూనిట్.
కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాని నంబర్ 24న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. డెవిల్ డీకోడింగ్ అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ డెవిల్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇన్ని రోజులు ఎదురుచూసినందుకు మంచి వార్తా అంధించారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు